రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటాచ్
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీనే మోసం చేశాడు ఓ ఘనుడు . రిలయన్స్ అధినేతను మోసం చేసిన వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసును పెట్టి సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. ముఖేష్ అంబానీకి టోకరా వేసిన వ్యక్తి కల్పేష్ దఫ్తరీపై చర్యలు ప్రారంభించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
ఫార్చ్యూన్ గ్లోబెల్ జాబితా: ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్

సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు
సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారిక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇందులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఈడీ తెలిపింది. అవినీతి నిరోధక చట్టం 1988 లోని 13 (2) మరియు 13 (1) (డి) సెక్షన్లతో పాటు ఐపిసి మోసం 420, 467, 468, 471, 477 ఎ సెక్షన్లతో పాటు కేసు నమోదైంది.

కల్పేష్ దఫ్తారి సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ను మోసం చేసిన కల్పేష్ దఫ్తారి యాజమాన్యంలోని సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ .4.87 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తిలో ముంబైలో ఉన్న వాణిజ్య సముదాయం తో పాటు రాజ్‌కోట్‌లో నాలుగు వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. కల్పేష్ దఫ్తారి, కొంతమందితో పాటు, ప్రత్యేక వ్యవసాయ మరియు గ్రామ పరిశ్రమ పథకం విశేష్ కృషి మరియు గ్రామ ఉద్యోగ్ యోజన (వికెజియువై) యొక్క 13 లైసెన్సులను స్కామ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.

13 లైసెన్సులను రూ. 6.8 కోట్లకు విక్రయం .. కుట్రలో మరికొందరి పేర్లు
ఈ లైసెన్సులను హిందుస్తాన్ కాంటినెంటల్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట చాలన్ చేసి అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించినట్లుగా గుర్తించింది. దర్యాప్తులో, 13 లైసెన్సులను రూ. 6.8 కోట్లకు విక్రయించారని, ఈ మోసం గురించి ఎవరికీ తెలియకుండా ఒక సంస్థ నుండి మరొక సంస్థకు బదిలీ చేశారని గుర్తించారు. కల్పేశ్ దఫ్తరీతో పాటు, ఈ కుట్రలో పాల్గొన్న అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా వంటి పేర్లు కూడా బయటకు వచ్చాయి. దర్యాప్తులో, కల్పేష్ దఫ్తారి మరియు ఇతరులు ఈ డబ్బును ఉపయోగించినట్లు గుర్తించారు ఈడీ అధికారులు