For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతీ, మహీంద్రాలకు చిప్స్ కొరత, తగ్గిన కార్ల అమ్మకాలు, షేర్లు కిందకు

|

చిప్స్ కొరత వాహనాల ఉత్పత్తిపై పడుతోంది. ఉత్పత్తి పైన పడిన ప్రభావం ఆయా వాహన కంపెనీల స్టాక్స్ పైన కూడా కనిపిస్తోంది. సెమీ కండక్టర్స్ షార్టేజ్ కారణంగా తమ ఉత్పత్తిలో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రముఖ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ గురువారం (సెప్టెంబర్ 2) ఏకంగా రెండు శాతం మేర పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ దాదాపు 2 శాతం పతనమై రూ.755.00 వద్ద ముగిసింది. ఓ సమయంలో ఇది 2.60 శాతం మేర పడిపోయి రూ.750 వద్ద కూడా ట్రేడ్ అయింది. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో దారుణంగా పతనమైన స్టాక్స్‌లో ఇది ముందు ఉంది. ఇటీవల స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.

తమ ఆటో కంపెనీ సెమీ కండక్టర్స్ కొరతను ఎదుర్కొంటోందని, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా ఈ సమస్య మరింత పెరిగింది రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. దీంతో సెప్టెంబర్ 2021లో తమ కంపెనీ దాదాపు ఏడు రోజుల పాటు నో ప్రొడక్షన్ డేస్ (ఉత్పత్తి లేని రోజులు)గా ఉంటుందని తెలిపింది. దీంతో 2021 సెప్టెంబర్ నెలలో ఇరవై శాతం నుండి ఇరవై ఐదు శాతం ఉత్పత్తి కోత పడుతుందని తెలిపింది. అయితే ట్రాక్టర్లు, ట్రక్స్, బస్సులు, త్రీవీలర్స్ వ్యాపారంపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఆగస్ట్ నెలలో దేశీయ మార్కెట్లో 15,973 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది మహీంద్రా అండ్ మహీంద్రా. గత ఏడాది ఇదే కాలంలో 13,651 వాహనాలను విక్రయించింది. అంటే ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 Mahindra shares slip 2 percent as company stares at production cut due to chip shortage

ఈ వారం మొదట్లో మారుతీ సుజుకీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హర్యానా, గుజరాత్‌లలోని ప్లాంట్స్ సెమీకండక్టర్ల సమస్యను ఎదుర్కోవచ్చునని అభిప్రాయపడింది. ఆగస్ట్ నెలలో వాహన విక్రయాలు పెరిగాయని, కానీ డిమాండ్ మేరకు విక్రయాలు జరపలేకపోయామని, ఇందుకు చిప్స్ కొరత కారణమని మారుతీ సుజుకీ ప్రకటించింది. 2020 ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈ ఆగస్ట్‌లో దాదాపు కార్ల కంపెనీలు అన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి. కానీ కార్ల అమ్మకాలపై చిప్స్ కొరత ప్రభావం పడింది.

English summary

మారుతీ, మహీంద్రాలకు చిప్స్ కొరత, తగ్గిన కార్ల అమ్మకాలు, షేర్లు కిందకు | Mahindra shares slip 2 percent as company stares at production cut due to chip shortage

Shares of Mahindra slipped over 2 per cent after the company said its production will be cut by up to 25 per cent due to semiconductor shortage.
Story first published: Thursday, September 2, 2021, 22:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X