టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.40 లక్షల కోట్లు జంప్: రిలయన్స్ అదుర్స్
ముంబై: టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.40 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం కూడా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్‌కు ముందు వరుసగా ఆరు సెషన్లలో నష్టపోవడంతో రూ.3.96 లక్షల కోట్లు నష్టపోగా, బడ్జెట్ రోజు నుండి మార్కెట్లు పుంజుకోవడంతో గతవారం రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఈ వారం కూడా మార్కెట్ లాభపడింది. బడ్జెట్‌కు ముందు సెన్సెక్స్ 46వేల పాయింట్ల నుండి గతవారం 51వేల పాయింట్ల సమీపానికి చేరుకోగా, ఈ వారం ఆ మార్కు కూడా దాటింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్‌తో పాటు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.200 లక్షల కోట్ల దాటగా, గతవారం మరింత పెరిగి రూ.2,03,92,021.38 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,40,430.45 కోట్లు పెరిగింది. గతవారం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద గెయినర్‌గా నిలిచింది. బీఎస్ఈ సూచీ గతవారం 812 పాయింట్లు లేదా 1.60 శాతం ఎగిసింది.
లాభపడిన కంపెనీల్లో రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

వీటి ఎం-క్యాప్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.74,329.95 కోట్లు పెరిగి రూ.12,94,038.34 కోట్లకు చేరుకుంది.
- ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.22,943.86 కోట్లు ఎగిసి రూ.4,47,323.82 కోట్లకు చేరింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.15,888.27 కోట్లు పెరిగి రూ.5,57,835.85 కోట్లుగా నమోదయింది.
- HDFC మార్కెట్ క్యాప్ రూ.12,439.33 కోట్లు పెరిగి రూ.5,02,316.66 కోట్లకు చేరుకుంది. ఈ బ్యాంకు తొలిసారి రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ జాబితాలోకి వచ్చింది.
- టీసీఎస్ ఎం-క్యాప్ రూ.12,420.4 కోట్లు పెరిగి రూ.11,97,442.25 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.2,274.77 కోట్లు ఎగిసి రూ.3,36,032.83 కోట్లుగా నమోదయింది.
- ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.133.87 కోట్లు పెరిగి రూ.3,50,915.73 కోట్లకు చేరుకుంది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- HDFC మార్కెట్ క్యాప్ రూ.8,015.87 కోట్లు తగ్గి రూ.8,71,719.64 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,684.48 కోట్లు తగ్గి రూ.5,26,747.02 కోట్లకు చేరుకుంది.
- కొటక్ మహీంద్రా ఎం-క్యాప్ రూ.6,160.88 కోట్లు తగ్గి రూ.3,86,580.16 కోట్లకు తగ్గింది.
- మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ రూ.1294038.34 కోట్లతో ముందు ఉంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.