టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.29 లక్షల కోట్లు జంప్
టాప్ టెన్‌లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.29 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ టెన్‌లోని 9 కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.2,62,146.32 తగ్గింది. అంతకుముందు వారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ప్రాఫిట్ బుకింగ్, ఒమిక్రాన్ భయాలతో మార్కెట్లు అంతకుముందు రెండో వారాలు నష్టపోయాయి. అయితే ఈ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంపై ఓ అంచనాకు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ గతవారం సానుకూలంగా కనిపించింది. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 589 పాయింట్లు లేదా 1.03 శాతం లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ముగిశాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.71,761.59 కోట్లు లాభపడి రూ.13,46,325.23 కోట్లకు పెరిగింది.
- ఇన్ఫోసిస్ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.18,693.62 కోట్లు పెరిగిరూ.7,29,618.96 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.16,082.77 కోట్లు ఎగిసి రూ.4,26,753.27 కోట్లుగా నమోదయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,744.21 కోట్లు పెరిగి రూ8,38,402.80 కోట్లుగా నమోదయింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,393.86 పెరిగి రూ.5,01,562.84 కోట్లకు పెరిగింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.2,409.65 కోట్లు పెరిగి రూ.4,22,312.62 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,961.91 కోట్లు ఎగిసి రూ.5,50,532.73 కోట్లకు చేరింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
అదే సమయంలో ఈ కింది కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.10,489.77 కోట్లు క్షీణించి రూ.3,94,519.78 కోట్లకు తగ్గింది. అంతకుముందువారం కేవలం భారతీ ఎయిర్టెల్ స్టాక్ మాత్రమే లాభపడింది.
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,686.55 కోట్లు తగ్గి రూ.4,97,353.36 కోట్లకు పడిపోయింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,537.34 కోట్లు క్షీణించి రూ.15,27,572.17 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు..
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.