టాప్ 10లోని 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.47 లక్షల కోట్లు డౌన్
టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.47 లక్షల కోట్లు క్షీణించింది. అక్షరాలా రూ.1,47,360.93 తగ్గింది. భారీగా నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉన్నది. టాప్ టెన్‌లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడింది. అంతకుముందు వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.18 లక్షల కోట్లు పెరిగింది. ఆ సమయంలోను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాభపడింది. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1,050.68 పాయింట్లు లేదా 1.73 శాతం నష్టపోయింది. నవంబర్ 20వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లు క్లోజ్ ఉన్నాయి. దీంతో గతవారం నాలుగు రోజులు మాత్రమే రన్ అయ్యాయి.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.75,961.53 కోట్లు క్షీణించి రూ.15,68,550.17 కోట్లకు తగ్గింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.18,069.87 కోట్లు క్షీణించి రూ.12,85,660.79 కోట్లకు క్షీణించింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,321.11 క్షీణించి రూ.5,29,236.66 కోట్లకు తగ్గింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,816.28 కోట్లు తగ్గి రూ.4,01,367.04 కోట్లకు పడిపోయింది.
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.9,409.46 కోట్లు తగ్గి రూ.5,29,606.94 కోట్లకు పడిపోయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,904.08 కోట్లు తగ్గి రూ.8,52,532.36 కోట్లుగా నమోదయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు మొదటిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.6,514.96 కోట్లు నష్టపోయి రూ.4,49,755.80 కోట్లకు తగ్గింది.

ఇవి జంప్
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.5,166.77 కోట్లు తగ్గి రూ.4,52,188.74 కోట్లకు తగ్గింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,196.87 కోట్లు నష్టపోయి రూ.5,63,349.75 కోట్లకు చేరుకుంది.
- గతవారం కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడింది. ఈ స్టాక్ స్వల్పంగా రూ.294.39 కోట్లు ఎగిసి రూ.7,48,875.37 కోట్లకు చేరుకుంది.

టాప్ టెన్ కంపెనీలు..
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.