For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.90 కోట్లు జంప్: రిలయన్స్, టీసీఎస్ స్టాక్స్ పతనం

|

టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా ఎగిసింది. బజాజ్ ఫైనాన్స్‌లో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,90,571.55 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్ పరంగా మొదటి రెండు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మార్కెట్ క్యాప్ క్రితం వారం తగ్గింది. మిగతా సంస్థల స్టాక్స్ పెరిగాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డవాటిలో ముందున్నాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.35,878.56 కోట్లు పెరిగి రూ.2,63,538.56 కోట్లను తాకింది.

HDFC జంప్

HDFC జంప్

బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.35,878.56 కోట్లు పెరిగి రూ.2,63,538.56 కోట్లను తాకింది.

HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.34,077.46 కోట్లు పెరిగి రూ.7,54,025.75 కోట్లకు పెరిగింది.

HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,989.44 కోట్లు పెరిగి రూ.4,15,761.38 కోట్లకు పెరిగింది.

ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.30,142.34 కోట్లు పెరిగి రూ.3,35,771.38 కోట్లకు చేరుకుంది.

హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ.22,156.31 కోట్లు ఎగిసి రూ.5,14,223.88 కోట్లకు చేరుకుంది.

భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.17,266.84 కోట్లు పెరిగి రూ.2,62,630.53 కోట్లకు చేరుకుంది.

టీసీఎస్, రిలయన్స్ డౌన్

టీసీఎస్, రిలయన్స్ డౌన్

కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.10,520.48 కోట్లు పెరిగి రూ.3,50,501.27 కోట్లకు చేరుకుంది.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,540.12 కోట్లు పెరిగి రూ.4,82,783.05 కోట్లుగా ఉంది.

మరోవైపు, రిలయన్స్, టీసీఎస్ సంస్థల మార్కెట్ క్యాప్ తగ్గింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.18,392.74 కోట్లు తగ్గి రూ.13,53,624.69 కోట్లకు పడిపోయింది.

టీసీఎస్ ఎంక్యాప్ రూ.14,090.21 క్షీణించి రూ.10,02,149.38 కోట్లుగా ఉంది.

మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీలు..

మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీలు..

గతవారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 1745 పాయింట్లు లేదా 4.16 శాతం లాభపడింది. టాప్ 10 మోస్ట్ వ్యాల్యుబల్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.

English summary

M cap of 8 of top ten most valued firms zooms Rs 1.9 lakh crore

The combined market valuation of eight of the top-10 most valued companies zoomed ₹1,90,571.55 crore last week, with Bajaj Finance emerging as the biggest gainer, reflecting bullish investor sentiment.
Story first published: Sunday, November 15, 2020, 20:15 [IST]
Company Search