For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar: NRIలకు ఆధార్ కార్డు అవసరమా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

|

Aadhaar: భారత పౌరులందరికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం కీలక అధికారిక ధృవపత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. దీనిని జాగ్రత్తగా వినియోగించటం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అందించే ఎలాంటి స్కీమ్స్ కింద లబ్ధి పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరి.

బ్యాంకింగ్ రంగంలో..

బ్యాంకింగ్ రంగంలో..

కేవలం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల విషయంలో మాత్రమే కాక.. ఎలాంటి ఆర్థిక సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు చాలా ముఖ్యం. కేవైసీకి ఆధార్ ఒక కీలక ధృవపత్రంగా మారింది. అందువల్ల విదేశాల్లో ఉండే భారతీయులు దీనిని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చా..? దీంతో పనేంటి..? వంటి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 విదేశాల్లోని భారతీయులు..

విదేశాల్లోని భారతీయులు..

భారతీయ పాస్‌పోర్ట్‌లు కలిగిన NRIలు ఏదైనా ఆధార్ కేంద్రం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని UIDAI వెల్లడించింది. అందువల్ల విదేశాల్లో అర్హత ఉన్న ఎన్‌ఆర్‌ఐలందరూ ఆధార్ కార్డును సులువుగా పొందవచ్చు. అయితే దీనిని ఎలా పొందాలనేదాని గురించి స్టెప్ బై స్టెప్ మార్గదర్శకాలను యూఐడీఏఐ అందించింది.

పాటించాల్సిన పద్ధతి..

పాటించాల్సిన పద్ధతి..

Step 1 : ముందుగా సదరు ఎన్ఆర్ఐ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి

Step 2 : వెళ్లేటప్పుడు భారతీయ పాస్‌పోర్ట్‌ను తప్పక వెంట తీసుకెళ్లాలి

Step 3 : ఆధార్ కార్డ్ పొందడానికి రిజిస్ట్రేషన్ ఫారమ్‌ నింపాల్సి ఉంటుంది

Step 4 : NRIలు వారి ఈ-మెయిల్ IDని అందించాలి

Step 5 : NRI కోసం ప్రకటన నమోదు భారతీయ పౌరుల డిక్లరేషన్ వివరాలు పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేయాల్సి ఉంటుంది

Step 6 : మిమ్మల్ని ఎన్‌ఆర్‌ఐగా నమోదు చేయమని ఆధార్ సెంటర్ ఆపరేటర్‌ని అడగాల్సి ఉంటుంది

Step 7 : గుర్తింపు రుజువు కోసం భారత ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్‌ను ఆపరేటర్‌కు ఇవ్వండి

Step 8 : గుర్తింపు తర్వాత బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి

Step 9 : ఆపరేటర్‌ సబ్మిట్ చేసే ముందు కంప్యూటర్ స్క్రీన్‌పై నమోదు చేసిన అన్ని వివరాలను సరిచూసుకోండి

Step 10 : మీ 14 అంకెల రిజిస్ట్రేషన్ ID మరియు తేదీ మరియు సమయ స్టాంపుతో రసీదు లేదా రిజిస్ట్రేషన్ స్లిప్‌ను సురక్షితంగా ఉంచండి.

 స్టేటస్ తెలుసుకోవటం..

స్టేటస్ తెలుసుకోవటం..

పైన ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత మీరు.. myaadhaar.uidai.gov.in/CheckAadhaarStatusలో మీ ఆధార్ జనరేషన్ స్థితిని తనిఖీ చేయవచ్చు. UIDAI సిస్టమ్ ప్రకారం.. మీ చిరునామా, పుట్టిన తేదీని ధృవీకరించడానికి మీ పాస్‌పోర్ట్‌తో పాటు మరొక చెల్లుబాటు అయ్యే పత్రాన్ని అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత చిరునామా రుజువుతో పాటు నవీకరించబడిన భారతీయ చిరునామాను తప్పనిసరిగా అందించాలి.

 అందుకు ఆధార్ కావాల్సిందే..

అందుకు ఆధార్ కావాల్సిందే..

ఎవరైనా ఎన్ఆర్ఐ భారతదేశానికి వచ్చి ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో పని చేయాలనుకుంటే ఆధార్ కార్డు అవసరం. దీనికి తోడు వారు ఆదాయపు పన్ను చట్టాల కింద ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఆధార్ తప్పక అవసరం. దీనికి తోడు దేశంలో భూమి, ఇల్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా సదరు ఎన్ఆర్ఐ ఆధార్ కార్డును తప్పక కలిగి ఉండాల్సిందేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే దీనికి ఆధార్ తప్పనిసరి కాకపోయినప్పటికీ.. వారు NRI అని రుజువును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

English summary

Aadhaar: NRIలకు ఆధార్ కార్డు అవసరమా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.. | Know why NRI's should have Aadhaar Card and how to apply for it simply

Know why NRI's should have Aadhaar Card and how to apply for it simply
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X