For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Policy: కుమార్తె కోసం రోజూ రూ.125 డిపాజిట్ చేస్తే.. వివాహ సమయానికి రూ.27 లక్షలు.. పూర్తి వివరాలు

|

LIC Policy: మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు చింతలన్నీ మరచిపోండి. LIC అందిస్తున్న పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఇది మీ పిల్లల చదువు నుంచి వారి వివాహం వరకు ప్రతి ఆందోళనలూ తొలగిపోతాయి. LIC అందిస్తున్న ఈ స్కీమ్ పేరు జీవన్ లక్ష్య. ఈ పాలసీ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది స్థిర ఆదాయంతో పాటు పెట్టుబడి మెుత్తం భద్రతకు హామీ ఇస్తుంది. ఇందులో రోజూ రూ.125 డిపాజిట్ చేస్తే రూ.27 లక్షలు వస్తాయి. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్లాన్ 25 సంవత్సరాల కలవ్యవసధి ఉంటుంది. కానీ మీరు ప్రీమియం 22 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.

స్కీమ్ అర్హత వివరాలు..

స్కీమ్ అర్హత వివరాలు..

జీవన్ లక్ష్య స్కీమ్ కింద.. పాలసీ ప్రారంభమైన తర్వాత పాలసీ లక్ష్యం గడువు ముగియదు. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో.. పాలసీ మిగిలిన సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం బీమా మొత్తంలో 10 శాతం కుమార్తె పొందుతుంది. ప్రీమియంను నెలవారీ, క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. అర్హత గురించి మాట్లాడుకున్నట్లయితే.. దీని కోసం కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు ఉండగా.. గరిష్ఠ ప్రవేశ వయస్సు 50 ఏళ్లుగా ఉంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయస్సు 65 ఏళ్లు. దీనిలో LIC యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్లను అందిస్తోంది.

 మెచ్యూరిటీ బెనిఫిట్స్..

మెచ్యూరిటీ బెనిఫిట్స్..

పాలసీ హోల్డర్ మనుగడపై హామీ మొత్తంతో పాటు సాధారణ రివిజనరీ బోనస్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా.. అదనపు బోనస్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. రెండు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీకి చెల్లించే ప్రీమియంను ఆదాయపు పన్నులోని సెక్షన్- 80C కింద మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. సెక్షన్- 10D కింద మెచ్యూరిటీ సొమ్ము మొత్తం పన్ను రహితమైనది.

రూ. 27 లక్షలు ఎలా పొందవచ్చంటే..

రూ. 27 లక్షలు ఎలా పొందవచ్చంటే..

ఎవరైనా వ్యక్తి 30 ఏళ్ల వయస్సులో రూ. 10 లక్షల హామీ మొత్తాన్ని తీసుకున్నట్లయితే.. దాని కోసం మీరు ప్రతి నెలా దాదాపు రూ. 3,800 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే.. మీరు ప్రతిరోజూ రూ. 125 ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెడుతున్నట్లు. ప్రతి నెలా రూ.3,800 డిపాజిట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత.. సదరు పెట్టుబడిదారునికి రూ.27 లక్షలు పొందుతారు. అదే సమయంలో.. ఈ పాలసీని తీసుకోవడానికి ఆధార్ కార్డ్, ఆదాయ రుజువు, ఏదైనా ఒక గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లను అందించాలి.

English summary

LIC Policy: కుమార్తె కోసం రోజూ రూ.125 డిపాజిట్ చేస్తే.. వివాహ సమయానికి రూ.27 లక్షలు.. పూర్తి వివరాలు | know about jeevan lakshya policy that gives 27 lakhs to it's policy holders with 125 rupees on daily basis

know about jeevan lakshya policy for your girl childs future
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X