For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిజిటల్: అదే మన ఫ్యూచర్ అంటున్న కిషోర్ బియాని

|

ఫిజిటల్. వినడానికి కొత్తగా ఉంది కదా? ఫిజికల్ ప్లస్ డిజిటల్ ను కలిపితే వచ్చే పదమే ఫిజిటల్. ఇదే మన ఫ్యూచర్ అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ బియాని. బిగ్ బజార్ వంటి భారీ రిటైల్ చైన్స్ ను నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్ అధినేత ఐన కిషోర్ బియాని ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. ప్రపంచ వాణిజ్య సరళిని పసిగట్టి ... మన దేశంలో ఇక ముందు వ్యాపారం జరిగే తీరు తెన్నులను అయన విశ్లేషించారు. ఈ సందర్భంగానే కిషోర్ బియాని ఈ పద ప్రయోగం చేసారు. ఇప్పుడంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. అసలు విషయానికి వస్తే... ఇండియా లో సాంప్రదాయ బద్ధంగా స్టోర్ లలోనే రిటైల్ వ్యాపారం జరిగేది.

కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ల రాకతో ఇండియా లో కూడా ఆన్లైన్ బిజినెస్ జోరందుకుంది. ఓ దశలో ఆన్లైన్ దెబ్బకు ఆఫ్ లైన్ వ్యాపారం కుదేలై పోయింది. ఒక్క రిటైల్ మాత్రమే కాకుండా ఫుడ్ బిజినెస్ కూడా ఆన్లైన్ కు మళ్లింది. స్విగ్గి, జొమాటో ల దెబ్బకు రెస్టారెంట్ల బిజినెస్ దెబ్బతింది. కానీ ఇక ముందు ఇండియా లో ఏ బిజినెస్ డామినెట్ చేస్తుంది. ఏది పతనం అవుతుందో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా లో ఆన్లైన్ బిజినెస్ మొదలై కేవలం 10 సంవత్సరాలే అవుతున్నా... అది దేశమంతా విస్తరించింది. చిన్న పల్లెలకు కూడా ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు చేరుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆఫ్ లైన్ స్టోర్ బిజినెస్ పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్నర్థకం అవుతోంది.

HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు

అమెజాన్ తో జట్టు...

అమెజాన్ తో జట్టు...

కిషోర్ బియాని కి చెందిన ఫ్యూచర్ రిటైల్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో కలిసి పనిచేసేందుకు చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ కౌపోన్స్ అనే సంస్థలో అమెజాన్ రూ 1,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా... ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన అన్ని స్టోర్ల లోని ప్రొడక్టులను అమెజాన్ వెబ్సైటు లో అమ్మకానికి ఉంచుతారు. అలాగే, స్టోర్ల లో కూడా అమెజాన్ ఇచ్చే ఆఫర్ల ను కస్టమర్ల కు అందజేస్తారు. అంటే ఆన్లైన్ లోని ఆఫర్లు ఆఫెలైన్ లోకి, స్టోర్ల లోని ప్రోడక్టులు డిజిటల్ లోకి రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే... వినియోగదారులకు ఉత్పత్తుల హోమ్ డెలివరీ సేవలు సైతం అందించటం. బిగ్ బజార్ లోని ప్రొడక్టులను అమెజాన్ వెబ్సైటులో బుక్ చేస్తే... మనకు సమీపంలోని బిగ్ బజార్ నుంచి మన ఇంటికే సరుకులు డెలివరీ చేస్తారు. ఈ విధానమే ఫిజిటల్.

గేమ్ చేంజ్...

గేమ్ చేంజ్...

ఇండియాలో రిటైల్ బ్రాండింగ్ గేమ్ చేంజ్ అయిపోయిందని కిషోర్ బియాని అభిప్రాయం. ఒకప్పుడు ఒక బ్రాండ్ సృష్టించటం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇండియాలో ఈ-కామర్స్ విస్తరించిన తర్వాత గేమ్ మారిపోయింది. ఇప్పుడు కావాల్సిన బ్రాండును ఆన్లైన్ లో వెతికి కొనుగోలు చేసుకోవచ్చు అని అయన తెలిపారు. ఈ విధానమే ఇకపై ఒక స్థాయిలో ఉండే అన్ని రకాల వ్యాపారులు ఫాలో అవుతారని, అందుకే ఇండియాలో ఫిజిటల్ రిటైల్ దే భవిష్యత్ అని అయన విశ్వాసం. చూద్దాం ఏం జరుగుతుందో!

English summary

Kishore Biyani sees a Phygital future for retail

Kishore Biyani, chief executive of the Future Group, Thursday said that traditional offline retailing and web commerce are not as distinct as they once were, with the odds shortening that the two channels to reach end consumers would head toward total convergence in the near future.
Story first published: Friday, January 17, 2020, 20:35 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more