For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPO News: ఆరంభంలోనే అదరగొట్టిన ఐపీవో.. రియల్టీ రంగంలో వ్యాపారం

|

Keystone Realtors IPO: ఈరోజే మార్కెట్లోకి అడుగుపెట్టిన కీస్టోన్ రియల్టర్స్ రియల్టీ రంగంలో వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ కంపెనీ 'రుస్తోమ్‌జీ' బ్రాండ్‌ పేరుతో ఆస్తులను విక్రయిస్తోంది. ఈ నెల 14న ప్రారంభమైన ఈ ఐపీవో 16న ముగిసింది. ఐపీవోలో కంపెనీ 86,47,858 షేర్లను ఆఫర్ చేయగా.. 1,73,72,367 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

కీస్టోన్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ IPO స్టాక్ మార్కెట్‌లో ఈరోజు లిస్ట్ చేయబడింది. లిస్టింగ్‌తో పాటు ఇన్వెస్టర్లకు కంపెనీ మంచి లాభాలను అందించింది. NSEలో ఒక్కో షేరు రూ.555 చొప్పున, బీఎస్ఈలో షేర్ రూ.541 చొప్పున లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ తర్వాత బీఎస్ఈలో స్టాక్ రూ.568 మార్కును తాకింది.

IPO News: ఆరంభంలోనే అదరగొట్టిన ఐపీవో

మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. కీస్టోన్ రియల్టర్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.190 కోట్లకు పైగా సేకరించారు. యాంకర్ ఇన్వెస్టర్లు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, మోర్గాన్ స్టాన్లీ, సెంట్ క్యాపిటల్ ఒక్కొక్కటి 35% వాటా కలిగి ఉన్నారు. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్‌లో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాయి. వీటితోడు SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యాంకర్ ఇన్వెస్టర్లలో భాగంగా ఉన్నాయి.

1995లో స్థాపించబడిన కీస్టోన్ రియల్టర్స్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో 32 పూర్తయిన ప్రాజెక్ట్‌లు, 12 కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు కలిగి ఉంది. వీటికి తోడు మరో 19 రాబోయే ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది.

English summary

Keystone Realtors IPO listed in NSE, BSE at premium know details

Keystone Realtors IPO listed in NSE, BSE at premium know details
Story first published: Thursday, November 24, 2022, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X