For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొద్ది నెలల్లోనే అతిపెద్ద గ్రోసరీ రిటైలర్‌గా జియో మార్ట్.. దీపావళి ధమాకా

|

సంచలనాలకు మారు పేరు ముకేశ్ అంబానీ. అయన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో సేవలు ప్రారంభించి ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. దానిని ప్రారంభించిన కేవలం 3 ఏళ్లలో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా తీర్చిదిద్దటం చూశాం.

30 కోట్లకు పైగా వినియోగదారులతో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుని, ప్రపంచ అగ్రగామి సంస్థలు పేస్ బుక్, గూగుల్ వంటి సంస్థల నుంచి రూ వేల కొద్దీ పెట్టుబడులను ఆకర్షించింది. కేవలం రెండు నెలల్లో రూ 1.50 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించి ఔరా అనిపించింది. ఈ నేపథ్యంలో ఇండియా లో అప్పు లేని సంస్థగానూ ఆవిర్భవించింది. ఐతే ఇంతటితో రిలయన్స్ దూకుడు ఆగేలా లేదు.

ప్రస్తుతం ముకేశ్ అంబానీ ద్రుష్టి ఈ కామర్స్ వైపు మళ్లింది. దీంతో జియో మార్ట్ పేరుతో తొలుత గ్రోసరీ డెలివరీ పై ఫోకస్ పెట్టారు. ఇటీవలే ప్రారంభించిన జియో మార్ట్ మొబైల్ అప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, ఆప్ స్టోర్ల లో రికార్డులు సృష్టిస్తోంది.

శిబూలాల్ కీలక నిర్ణయం, ఇన్ఫోసిస్‌లో 85 లక్షల షేర్లు విక్రయం: ఎందుకంటే

1 మిలియన్ దాటిన డౌన్ లోడ్లు...

1 మిలియన్ దాటిన డౌన్ లోడ్లు...

ఈ ఏడాది మార్చి లోనే ప్రవేశపెట్టిన జియో మార్ట్ మొబైల్ ఆప్... ఇప్పటికే 10 లక్షల (1 మిలియన్) డౌన్ లోడ్ల ను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్ లోనూ, ఆప్ స్టోర్ లోనూ డౌన్ లోడ్ల వెల్లువ కొనసాగుతోంది. జియో మార్ట్ ఇప్పటికే దేశంలోని 200 నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ముంబై మహా నగరంలో ఐతే ఏకంగా వాట్సాప్ నుంచి కూడా ఆర్డర్ల ను తీసుకుంటోంది.

ఈ విధానాన్ని త్వరలోనే అన్ని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రారంభించి కొన్ని నెలలే అవుతున్నా... వినియోగదారుల నుంచి మాత్రం జియో మార్ట్ కు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. ప్రధానంగా గ్రోసరీ కొనుగోళ్లలో రికార్డులు నమోదు అవుతున్నాయి. రోజుకు లక్షల్లో వస్తున్న ఆర్డర్లతో జియో మార్ట్ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

నెంబర్ 1 దిశగా అడుగులు...

నెంబర్ 1 దిశగా అడుగులు...

ప్రస్తుతం జియో మార్ట్ కు రోజుకు సగటున 2.5 లక్షల ఆర్డర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రోసరీస్ కు సంబంచినవే. ఈ విషయాన్నీ ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. సుమారు 200 నగరాల్లో ఏకకాలంలో కార్యకలాపాలు ప్రారంభించటంతో ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు దక్కుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే రోజువారీ ఆర్డర్ల పరంగా చూస్తే ఇప్పటికే జియో మార్ట్ ... గ్రోసరీస్ డెలివరీ లో ఇండియా లో తొలిస్థానం లో ఉన్న బిగ్ బాస్కెట్ కు సమీపంలోకి వచ్చింది. ఒక అంచనా ప్రకారం బిగ్ బాస్కెట్ కు ప్రతి రోజు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల ఆర్డర్లు లభిస్తున్నాయి. దీంతో జియో మార్ట్ కూడా దానికి సమీపంలోకి వచ్చినట్లయింది. జియో మార్ట్ తన కార్యాలకపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి రోజుకు సగటున 5 లక్షల ఆర్డర్ల మార్కును చేరుకోనుంది. దీంతో ఆన్లైన్ గ్రోసరీస్ డెలివరీ విషయంలో దేశంలోనే జియో మార్ట్ నెంబర్ 1 స్థానంలో నిలువనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీపావళి ధమాకా...

దీపావళి ధమాకా...

గ్రోసరీస్ తో పాటు దీపావళి నాటికి జియో మార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సహా అనేక ఇతర విభాగాలను కూడా జోడించాలని జియో భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడు కేవలం గ్రోసరీస్ మాత్రమే కాకుండా, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల విక్రయాలు కూడా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అదే జరిగితే దేశంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నేరుగా పోటీ నిచ్చే మూడో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.

దీంతో ఇండియన్ ఈ కామర్స్ సెక్టార్ లో త్రిముఖ పోటీ నెలకొంటుంది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం గ్రోసరీస్ డెలివరీ సేవల్లో ఉన్న అమెజాన్ పాంట్రీ, గ్రోఫెర్స్ వంటి సంస్థలకు రోజుకు సగటున 1 లక్ష వరకు ఆర్డర్లు లభిస్తున్నాయి. కానీ, ఒకసారి జియో మార్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే వీటన్నిటికీ పెద్ద దెబ్బ ఎదురుకానుంది విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

JioMart set to become largest e grocer

Within a few days of its launch, Reliance Retail-owned JioMart app has been catching up faster and has crossed the one million downloads mark on the Google Play Store and is one of the top three apps in the ‘Shopping’ category.
Story first published: Sunday, July 26, 2020, 15:44 [IST]
Company Search