For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు షాక్: స్టాక్ మార్కెట్ మాంత్రికుడికి తప్పని తిప్పలు

|

భారత్ స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్ ఝున్ వాలా పేరు తెలియని వారుండరు. ఆయన్ని ఇండియన్ వారెన్ బఫెట్ అని... స్టాక్ మార్కెట్ మాంత్రికుడు అని సంభోదిస్తారు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారమే. రాకేష్ ఒక కంపెనీలో షేర్లు కొన్నారంటే చాలు... ఇక ఆ కంపెనీ స్టాక్స్ పరుగులు పెట్టేవి. ఆయన రూ 100 కొన్న షేరు రూ 200, రూ 300 లేదా అంతకంటే ఎక్కువకు రూ 500 కు చేరిన సందర్భాలు అనేకం. అందుకే ఇండియన్ కాపిటల్ మార్కెట్లో ఆయనొక ఏస్ ఇన్వెస్టర్. కానీ ఆయనకు కూడా ఇప్పుడు ఒక పెద్ద కష్టమొచ్చి పడింది.

కేవలం చిన్న ఇన్వెస్టర్ గా మొదలైన అయన ప్రస్థానం ... బిలియన్ డాలర్ల సంపదను పోగేసుకునేలా ఎదిగింది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆదర్శం. అందరు ఇన్వెస్టర్ల లా కాకుండా ... భిన్నంగా ఆలోచిస్తూ పునాదులు పటిష్టంగా ఉండే కంపెనీల్లో స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు అధికంగా కొనుగోలు చేయటం అయన స్టైల్. కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవని, ఎంతటికి ఉద్ధండికైనా ఒడిడుకులు సహజమేనని ప్రస్తుతం అయన పోర్టుఫోలియో నిరూపిస్తోంది. 90% అయన పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.

హైదరాబాద్‌లో బౌన్స్ స్కూటర్ షేరింగ్ సేవలు, కి.మీ.కు రూ.1!

30 కంపెనీల్లో పెట్టుబడి...

30 కంపెనీల్లో పెట్టుబడి...

రాకేష్ ఝున్ ఝున్ వాలా మొత్తంగా 30 కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. అయితే, 2019 సంవత్సరం ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. పైగా 30 కంపెనీలకు గాను 26 కంపెనీల షేర్లు సాధారణ రిటర్న్స్ కూడా ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది బిఎస్ఈ సెన్సెక్స్ 13% పెరిగింది. కానీ రాకేష్ కంపెనీల్లో ఆ 26 షేర్లు కనీసం 13% లాభాలు కూడా తెచ్చిపెట్టలేదు. పైగా భారీ పతనాన్ని చవిచూశాయి. అయన కొనుగోలు చేసిన ప్రతి 10 కంపెనీల షేర్ల కు గాను 7 కంపెనీల షేర్లు కనీసం 10% పతనాన్ని చవి చూడగా... ప్రతి పది లో 7 షేర్లు ఒక్క రూపాయి లాభాన్ని కూడా ఆర్జించలేకపోవటం గమనార్హం.

94% పడిపోయిన డీహెచ్ఎఫెల్ ...

94% పడిపోయిన డీహెచ్ఎఫెల్ ...

ఈ ఏడాది రాకేష్ పెట్టుబడుల్లో ఒకటైన దివాన్ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫెల్)... అత్యధికంగా 94% పతనం ఐంది. అంటే లాభాల మాట దేవుడు ఎ రుగు ... పెట్టిన పెట్టుబడి కూడా సుమారు 100 % హరించుకుపోయినట్లయింది. మందాన రిటైల్ 68%, డీబీ రియాలిటీ 67%, ఆటోలోనే ఇండస్ట్రీస్ 58%, ప్రకాష్ ఇండస్ట్రీస్ 50%, బిల్ కేర్ 48%, టీవీ 18 బ్రాడీకాస్ట్ 42%, మాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ 39%, ఎన్సీసీ 39%, జియోజిత్ ఫైనాన్సియల్ 38%, పోరింజు ప్రాపర్టీస్ 36% మేరకు పతనం అయ్యాయి.

చీకటి సమయం....

చీకటి సమయం....

ఈ పరిణామం పై అక్టోబర్ లో ఈటీ నౌ ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. డాన్ ముందున్న చీకటి సమయమిదే కావొచ్చు అని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అందరికీ ఒక అవకాశం ఇస్తుందని, షేర్లు పెరిగే ముందు కొనుగోలు చేసేందుకు ఆ అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ కూడా వాతావరణం లాంటిదేనని, అది కొన్ని సార్లు మనకు నచ్చక పోయినా భరించాల్సిందేనని రాకేష్ చెప్పారు. అయన పోర్ట్ఫోలియో కంపెనీల్లో పతనమైన షేర్ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఎదిల్వాయ్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్, కరూర్ వైశ్య బ్యాంకు, జుబిలాంటి లైఫ్ సైన్సెస్, ఆప్టెక్ , వీఐపీ ఇండస్ట్రీస్, డెల్టా కార్ప్ , ఫస్ట్ సోర్స్ సోలుషన్స్, ఎస్కార్ట్స్, అనంత రాజ్, లుపిన్ ఫార్మా కంపెనీలు 10% నుంచి 36% మేరకు డౌన్ అయ్యాయి.

టైటాన్ మెరుపులు...

టైటాన్ మెరుపులు...

అయితే, రాకేష్ ఝున్ ఝున్ వాలా కొన్ని షేర్లు మాత్రం అయన కు మెరుగైన రాబడిని తెచ్చి పెట్టాయి. అందులో అయన చాలా కాలంగా ఎంతో నమ్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్న టైటాన్ కూడా ఒకటి కావటం విశేషం. ఈ షేరు 27% నికి పైగా పెరిగింది. రాకేష్ మొత్తం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లో దాదాపు సగం టైటాన్ లోనే ఉంటుందని సమాచారం. అయాన్ ఎక్స్చేంజి 97%, ఎంసీఎక్స్ 51%, స్పైస్ జెట్ 17% పెరిగి ఆయనకు కొంత ఊరటనిచ్చాయి.

English summary

Jhunjhunwala's portfolio bleeding! 24 stocks down up to 90% for 2019

Two dozen stocks that are part of ace investor Rakesh Jhunjhunwala’s portfolio fell up to 90 per cent in Calendar 2019 in line with the broader market, which saw most midcap and smallcap stocks bleed through the year.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more