For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనతా కర్ఫ్యూ ... ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయి?

|

ఇండియా లో మొట్ట మొదటి సారి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నిర్వహిస్తున్న కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోగలమన్న సంకల్ప బలాన్ని చూపేందుకు దీనిని రూపొందించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ ప్రతిపాదనకు మద్దతునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దీనిపై మరింత శ్రద్ధ పెట్టి ప్రజలను జాగృతం చేసారు. దీంతో హైదరాబాద్ లో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేస్తున్నారు. ఉదయం నుంచే రోడ్ల పై వాహనాలు కాదు కదా సాధారణ ప్రజలు కూడా ఎవరూ కనపడటం లేదు. ఇంత నిబద్ధత ప్రజల్లో కనిపించే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే ప్రజలు ఇలా సంఘటితం అవుతారు.

కానీ, ఇప్పుడు ఒక ప్రాణాంతక వైరస్ పై యుద్ధం చేసేందుకు ముందుకు రావటం విశేషం. తద్వారా ప్రపంచానికి భారత్ ఒక గొప్ప సందేశం పంపించింది. 130 కోట్లకు పైబడిన జనాభాతో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారత్... ఏదైనా గట్టిగా అనుకుంటే ఎంత గొప్పగా దానిని చేయగలదో జనతా కర్ఫ్యూ తో నిరూపించింది. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట కేవలం ప్రసంగాలకు పరిమితం కాదని, అది భారత జాతి జీవన విధానం అని మరో మారు ప్రస్ఫుటం చేస్తోంది.

జాక్‌మా, బిల్‌గేట్స్ సాయం, భారత కుబేరులు చప్పట్లు కొట్టడమేనా?

కరోనా గొలుసుకు అడ్డుకట్ట...

కరోనా గొలుసుకు అడ్డుకట్ట...

చైనా లో మొదలైన కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. ఈ దరిమిలా ఇండియాకు కూడా వచ్చేసింది. సుమారు 300 మందికి సోకి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి... జనంలో కలిసి తిరగకుండా ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటిస్తే దాని వ్యాప్తిని అరికట్టవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం కరోనా వైరస్ సాధారణ మనుగడ కాలం 12 గంటలు అని అంచనా. అంటే సుమారు 12 గంటల పాటు వైరస్ సోకిన వారికి ఆరోగ్యంగా ఉన్న వారు దూరంగా ఉంటే ... కరోనా వ్యాప్తి గొలుసు (చైన్) కు అడ్డుకట్ట వేయవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (మార్చి 22) ఒక రోజు సుమారు 14 గంటల పాటు అందరూ ఇండ్ల లోనే ఉండి ఈ గొలుసుకు బ్రేక్ లు వేయాలని కోరారు. కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి దానిని 24 గంటల పాటు పాటిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల నిబద్ధత చూస్తే... మనం ఆ గొలుసు ను సమర్థవంతంగా అడ్డుకోగలం అని అనిపిస్తోంది.

ఎకానమీ పై ప్రభావం...

ఎకానమీ పై ప్రభావం...

ఏ కర్ఫ్యూ అయినా... బంద్ అయినా దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం జనతా కర్ఫ్యూ వల్ల కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కొంత ప్రభావం ఉంటుంది. ఈ ఒక్క రోజు బంద్ నిర్వహణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రూ 50,000 కోట్ల నుంచి రూ 60,000 కోట్ల మేరకు ప్రభావితం అవుతుంది. కానీ, ఇలాంటి విపత్కర సందర్భంలో నిర్వహించే స్వీయ నియంత్ర వల్ల మాత్రం దేశానికి మేలే జరుగుతుందని ఆర్థికవేత్తల అంచనా. ఈ నష్టం తాత్కాలికమే. కానీ, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే దీనికి పదింతలైన నష్టం సంభవిస్తుంది. అందుకే, ప్రజల ఆరోగ్యం బాగుంటే ఆర్థిక వ్యవస్థ దానికదే మెరుగవుతుంది కాబట్టి, పాలకులు సరైన పద్ధతిని ఎంచుకున్నారని చెప్పవచ్చు. శరీరానికి అప్పుడప్పుడు ఉపవాసం ఎలా మేలు చేస్తుందో... ప్రస్తుతం ఈ జనతా కర్ఫ్యూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తుందని నమ్మొచ్చు.

కాలుష్యానికి బ్రేక్...

కాలుష్యానికి బ్రేక్...

రోజువారీ బిజీ లైఫ్ స్టైల్ లో ఎవరికి వారు తమ తమ పనుల్లో పడి వాతావరణం, కాలుష్యం సహా ఇతర అంశాలను పట్టించుకోవటం లేదు. కానీ, ఈ రోజు జరిగే జనతా కర్ఫ్యూ వల్ల ఒక రోజు దేశం ప్రశాంతంగా శ్వాస తీసుకుంటుంది. వాయు, జల, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గిపోతాయి. తద్వారా మన ప్రకృతికి మళ్ళీ పునరుజ్జీవం పొసే అవకాశం లభిస్తుంది. ఈ కర్ఫ్యూ సర్వ జన సమ్మె లాగా కనిపించినా, సర్వ జన హితం కోసం జరిగే ఒక మహా యజ్ఞం కంటే గొప్పదని చెప్పొచ్చు. చైనా వంటి దేశాల్లో జనాల్లో కట్టడి చేయటం సులువే. కానీ ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో అది చాలా కష్టం. కానీ, భారత ప్రజలు అనుకోవాలే గానీ ఏదైనా సాధించగలరని జనతా కర్ఫ్యూ తో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఇది కేవలం భారతీయుల కోసం మాత్రమే జరుగుతున్నయజ్ఞం కాదు.. యావత్తు ప్రపంచ హితం కోసం జరుగుతున్న మహా యజ్ఞం అని కూడా చెప్పొచ్చు. తద్వారా మనది నిజమైన వసుదైక కుటుంబం అని చాటి చెప్పే సందర్భం ఇది.

English summary

Janata Curfew shows the world an efficient way to curtail further spread of Corona Virus

Despite a bit of negative impact on economy, Janata Curfew will show the world an efficient way to curtail further spread of Corona Virus. Economists estimate a Rs 50,000 Crore to Rs 60,000 Crore loss to the Indian economy, however, it will help reduce pollution - air, water and sound- drastically in the country. People of Hyderabad are voluntarily participating in Janata Curfew with utmost dedication for well being of the society. Prime Minister Narendra Modi and Chief Minister K Chandrashekhar Rao have requested and motivated the citizens to follow one day self restrictive - social distance activity on Sunday - March 22, 2020.
Story first published: Monday, March 23, 2020, 7:38 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more