For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inox Green IPO: మార్కెట్లో అడుగుపెట్టిన ఐనాక్స్ గ్రీన్.. మార్కెట్ వర్గాల మాటేంటంటే..

|

Inox Green IPO: విండ్ పవర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఐపీవో ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో ఈ ఐపీవో ఇష్యూ రేటు కంటే తక్కువ ధరకు అంటే డిస్కౌంట్ కు ఎక్స్ఛేంజీల్లోకి అరంగేట్రం చేసింది.

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో..

ఎన్ఎస్ఈలో స్టాక్ దాదాపు 8 శాతం తగ్గింపుతో అంటే షేరు రూ.60.5, బీఎస్ఈలో దాదాపు రూ.60కి లిస్ట్ అయ్యాయి. స్టాక్ వాస్తవ ఇష్యూ బ్యాండ్ ప్రైస్ రూ.61-65గా ఉంది. నవంబర్ 11న ప్రారంభమైన ఈ ఐపీవో ద్వారా కంపెనీ దాదాపు రూ.740 కోట్లను సమీకరించింది. మార్కెట్లో స్టాక్ ఫ్లాట్ గా లిస్ట్ అయ్యింది. ఇటీవల వచ్చిన చాలా ఐపీవోలు మంచి పనితీరును కనబరిచాయి.

ఫ్లాట్ లిస్టింగ్..

పునరుత్పాదక ఇంధన తయారీ రంగంలోని ఈ కంపెనీ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మ్యూట్ రెస్పాన్స్ వచ్చిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఐపీవో కేవలం 1.55 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇదే క్రమంలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగం కేవలం 50 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులు (RIIలు) 4.7 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఇష్యూలో రూ.370 కోట్ల విలువైన తాజా ఈక్విటీ విక్రయం మరియు దాని మాతృ సంస్థ ఐనాక్స్ విండ్ నుంచి అదే మొత్తంలో అమ్మకానికి ఆఫర్ ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

ఐనాక్స్ గ్రీన్ విండ్ ఫామ్ ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేకంగా విండ్ టర్బైన్ జనరేటర్లు అండ్ విండ్ ఫామ్‌లలో సాధారణ మౌలిక సదుపాయాల కోసం దీర్ఘకాలిక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(O&M) సేవలను అందించే వ్యాపారంలో కంపెనీ నిమగ్నమై ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాల మార్జిన్ తగ్గినప్పటికీ మంచి పనితీరును కనబరుస్తోంది.

తగ్గిన నష్టాలు..

తగ్గిన నష్టాలు..

కంపెనీ తన నికర నష్టాన్ని FY20లో రూ.27.7 కోట్ల నుంచి FY22లో రూ.5 కోట్లకు తగ్గించుకుంది. అలాగే జూన్ FY23తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.61.8 కోట్ల ఆదాయంపై రూ.11.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఐపీవోలో దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం తమ పెట్టుబడులను పెట్టాయి. కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై మార్కెట్ వర్గాలతో పాటు బ్రోకరేజ్ కంపెనీలు సైతం సానుకూలంగానే ఉన్నాయి.

English summary

Inox Green IPO: మార్కెట్లో అడుగుపెట్టిన ఐనాక్స్ గ్రీన్.. మార్కెట్ వర్గాల మాటేంటంటే.. | Inox green shares listed at discount in NSE, BSE know details

Inox green shares listed at discount in NSE, BSE know details
Story first published: Wednesday, November 23, 2022, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X