For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..

|

IT News: టెక్కీల యూఎస్ కలలు కుప్పకూలుతున్నాయి. కోటి ఆశలతో అమెరికా వెళ్లిన వారు ప్రస్తుతం లేఆఫ్‌ల కారణంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. టాప్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో స్వదేశాలకు తిరిగి వచ్చేస్తున్నారు.

టాప్ కంపెనీలు..

టాప్ కంపెనీలు..

ఇప్పటికే యూఎస్ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్ బుక్ తో పాటు అనేక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థలు సైతం నిర్థాక్ష్యణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియా నుంచి వలస వెళ్లిన అనేక మంది టెక్కీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే ఉండటానికి కుదరక తిరిగి ఇండియా రావటానికి మనసొప్పక సతమతమౌతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ తొలగింపుల జోరు ఇప్పుడప్పుడే తగ్గదని తెలుస్తోంది. మరింత కాలం కంపెనీలు కాస్ట్ కట్టింగ్ ప్రణాళికలను కొనసాగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెనుతిరుగుతున్న NRIలు..

వెనుతిరుగుతున్న NRIలు..

ప్రస్తుతం భారీ తొలగింపుల కారణంగా ప్రభావితమైన అనేక మంది ఎన్ఆర్ఐలు ఇండియాకు తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో చాలా మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. యూఎస్ లో పరిస్థితులు దిగజారినప్పటికీ భారతదేశంలో ఐటీ రంగం మాత్రం పెద్దగా ప్రభావితం కాలేదు. దేశంలోని స్టార్టప్ కంపెనీలు అనేక సవాళ్లకు పరిష్కారాలు అందించే పనిలో ఉండగా.. ఇది తిరిగి వచ్చే టెక్కీలకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా తిరిగి వచ్చేందుకు ఇదే సరైన సమయమని చాలా మంది కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వీసా గడువు..

వీసా గడువు..

అమెరికా విషయానికొస్తే చాలా మంది భారతీయ టెక్కీలు H1B, L1 వీసాలపై పని చేస్తున్నారు. అయితే వీరు పనిచేస్తున్న కంపెనీలో తొలగించబడినట్లయితే 60 రోజుల్లో మరో కొత్త ఉద్యోగాన్ని పొందాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో వారు ఇండియాకు తిరిగి రాక తప్పదు. ఇలా ఉద్యోగాల వేటలో విఫలమైన చాలా మంది చేసేది లేక తమ సొంత గ్రామాలకు, పట్టణాలకు తిరిగి వస్తున్నారు.

BLIND సైట్‌..

BLIND సైట్‌..

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన కొంత మంది తమ అభిప్రాయాలను BLIND సైట్‌లో పోస్ట్ చేస్తున్నారు. మెటాలో ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఇండియాకు తిరిగి వెళ్లి మనకు సరిపోయే ఛాలెంజింగ్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం మంచిదంటూ పోస్ట్ చేశాడు. ఇక్కడ పోస్ట్ పెట్టే వారి వివరాలు బహిర్గతం కానప్పటికీ.. ఉద్యోగి తన అధికారిక ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పోస్ట్ చేయగలరు. అంటే ఈ సైట్ లో నకిలీ వ్యక్తులు ఎలాంటి మెసేజ్ లు పోస్ట్ చేయలేరు. ఇది అచ్చం లింక్డ్‌ఇన్‌ని పోలి ఉంటుంది.

English summary

కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం.. | Indian Tech NRI's Returning to India after major jaint companies Huge Layoffs

Indian Tech NRI's Returning to India after major jaint companies Huge Layoffs
Story first published: Monday, January 23, 2023, 17:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X