కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపుడుతున్న సంస్కరణలతో దీర్ఘకాలిక జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం నుండి 8 శాతానికి చేరుకోవచ్చునని పేర్కొంది. దీంతో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా పదిహేను శాతానికి పెరిగి, కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా చేపడుతున్న సంస్కరణలు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయని తెలిపింది.
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్

భారత్, వియత్నాంకు ప్రయోజనం
తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, కార్మిక చట్టాల్లో మార్పులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు, ప్రయివేటీకరణ ప్రక్రియ ద్వారా దేశంలో ఉత్పాదకత పెరగడంతో పాటు వృద్ధికీ దోహదపడనుందని యూబీఎస్ ఆర్థికవేత్త తన్వీగుప్తా జైన్ అన్నారు. చైనాలో తయారీ వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ డ్రాగన్ దేశం నుండి తయారీ కేంద్రాలను మార్చడానికి కంపెనీలు నిర్ణయం తీసుకుంటే భారత్, వియత్నాం దేశాలు అధిక ప్రయోజనం పొందే అవకాశముందని తెలిపింది.

ఆర్థిక స్థిరత్వం, సంస్కరణలు
స్థానిక విపణిలోని వృద్ధి అవకాశాలు, తక్కువ కార్మిక వ్యయాలు, సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, సంస్కరణల వేగం కొనసాగుతుందనే ఆశాభావం వంటివీ వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం వాటా సాధించేందుకు తోడ్పడనుందని తెలిపారు.

ఉత్పత్తి పెరుగుదల
వివిధ అంశాల కారణంగా ప్రస్తుతం దాదాపు జీరో నుండి రానున్న రెండేళ్ల కాలంలో ఇండియా సరఫరా సామర్థ్యం 20 శాతం నుండి 30 శాతానికి చేరుకోవాలని గుప్తా జైన్ అన్నారు. ఇప్పటికే ఆపిల్ దేశంలో తన ఉత్పత్తిని పెంచనుంది. అలాగే ప్రపంచ ఎలక్ట్రిక్ కారు మేజర్ టెస్లా మోడల్ 3 ఉత్పత్తిని స్థానికంగా చేయనుంది. చైనా స్థూల ఎగుమతుల్లో 30 శాతం వరకు బలమైన పోటీ లేనివిగా పేర్కొన్నారు.