For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేసిందంతా వృధా.. మళ్ళీ పేదరికంలోకి భారత్! ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

|

భారత్ ఒక వర్ధమాన దేశమని, అభివృద్ధి చెందుతున్న దేశమని ఎప్పటి నుంచో వింటున్నాం. క్రమంగా మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) లో మనం మెరుగైన అభివృద్ధి ని సాధించి ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తున్నాం. ఈ క్రమంలో గత పదేళ్లలో భారత్ లో పేదరికం బాగా తగ్గింది. కేవలం ప్రభుత్వ గణాంకాల ప్రకారమే కాకుండా... వాస్తవిక దృష్టితో చూసినా ఇది నిజమేననిపిస్తుంది.

ఎందుకంటే కూడు, గుడ్డ విషయంలో స్వావలంభన సాధించాం. ఒక గూడు విషయంలో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నాం. కానీ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ఒక ఉపద్రవాన్ని మోసుకు వచ్చింది. మన దేశం మళ్ళీ పేదరికం కోరల్లోకి వెళ్లిపోయే ప్రమాదాన్ని అది దూసుకొస్తోంది. ఎంతో కష్టపడి సాధించిన పురోగతి, ప్రగతి కేవలం ఒక్క ఏడాది సమయంలోనే కరోనా పుణ్యమా అని మన పునాదులు కదిలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్నీ ప్రపంచ బ్యాంకు కూడా చెబుతోంది. అది ప్రభుత్వానికి నివేదించిన ఒక రిపోర్ట్ లో ఈ భయంకరమైన నిజాలు వెల్లడించినట్లు సమాచారం.

భారత్ సహా ఆ దేశాల దెబ్బతో టిక్‌టాక్ ఉక్కిరిబిక్కిరి, దిక్కుతోచక కీలక నిర్ణయం!

ఉపాధి ఉపద్రవం...

ఉపాధి ఉపద్రవం...

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలను చుట్టేసింది. ఇందులో భాగంగా మన దేశం లోకి అడుగిడింది. మొదలైన తొలినాళ్లలో ఫరవాలేదు అనిపించినా... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆందోళన పెరుగుతోంది. వైరస్ భయానికి రెండు నెలలు పూర్తిగా లాక్ డౌన్ విధించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ ప్రయోజనం పెద్దగా కనిపించలేదు. పైగా లాక్ డౌన్ తో కోట్ల మందికి ఉపాధి కరువు అయ్యింది. లాక్ డౌన్ ఉపసంహరించిన అనంతరం కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాకపోగా... దిగజారిపోతున్నాయి. మన దేశంలో ఉద్యోగాలు కోల్పోయి, జీతాల్లో కోతలు పడి బతుకు బండిని లాగేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందులో ఉపాధి లేకపోవటమే అతి పెద్ద ఉపద్రవంగా ఉన్న విషయం విదితమే. లాక్ డౌన్ విధించిన సందర్భంగా ప్రజలకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కానీ అందులో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడి పెద్దగా లేకపోవటంతో ప్రజలు ఉసూరు మంటున్నారు.

90% మంది అసంఘటిత రంగంలోనే...

90% మంది అసంఘటిత రంగంలోనే...

మన దేశంలో పని చేయగలిగే యువత, శ్రామిక శక్తి అపారం. 15 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో 65% కంటే అధికంగా ఉంది. అందుకే ప్రపంచంలోనే ఈ విషయంలో భారత్ ను మించిన మరో దేశం లేకపోవటం మనకు కలిసొచ్చే అంశం. అందుకే ప్రపంచమంతా మన వైపు ఆసక్తిగా చూస్తోంది. కానీ అదే సమయంలో ఇండియా లో పనిచేస్తున్న 90% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తుండటం... వారికి సరైన ఉద్యోగ భద్రత లేకపోవటం విచారకరం. ఇప్పుడు ఇదే అంశం మన అవకాశాలను దెబ్బతీయంతో పాటు ప్రజలకు ఉపాధిని దూరం చేస్తోంది. దీంతో పేదరికం కోరల్లోకి వెళ్లేందుకు ఇక్కడ అధిక అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రపంచ బ్యాంకు కూడా తన నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

13% నికి తగ్గిన పేదరికం...

13% నికి తగ్గిన పేదరికం...

జనాభా పరంగా ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం కావటం వల్ల మన వద్ద పేదరికం ఎక్కువే ఉంటుంది. దశాబ్దాలుగా అది 30% నికి పైగా నే ఉండేది. కానీ, ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ మార్గ నిర్దేశకలా ప్రకారం... ఇండియా లో 2011 - 2015 మధ్య కాలంలో పేదరికం 21.6% నుంచి 13.4% నికి పడిపోయింది. ఆ తర్వాత కూడా పేదరికం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో పెరిగిన ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలు పేదరికాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ కూడా పురోగతిలో ఉండటం కలిసి వచ్చింది. దీంతో అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో సుమారు 30 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయట ప్రదేశమని గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దాదాపు రెండేళ్ల నుంచి పరిస్థితులు తారు మారు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం లోకి వెళ్ళిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా రక్కసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించటంతో ఇక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. మళ్ళీ పేదరికం తన కోరలు చాచేలా పరిణామాలు సంభవిస్తున్నాయి.

English summary

India is at risk of losing hard won gains in the fight against poverty

The World Bank has warned in its draft India Development Update (IDU) that the country is at "risk of losing its hard-won gains against poverty", ET has learnt. It also said that several households are "likely to slip back into poverty due to income and job losses triggered by Covid-19".
Story first published: Saturday, July 25, 2020, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X