For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం, సలహా తీసుకోండి: మోడీకి రఘురాం రాజన్ కీలక సూచనలు

|

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. పేదలపై ఖర్చు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సూచించారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని, నాటి నేతలు, ప్రస్తుత విపక్షాలు, నిపుణుల సాయం తీసుకోవాలని సూచించారు. స్వాతంత్రం తర్వాత అతిపెద్ద అత్యవసర పరిస్థితి అన్నారు.

ఈ సమయంలో ఇలాంటివా: సొంత ఉద్యోగులకు SBI గట్టి వార్నింగ్

సంక్షోభంలోకి వచ్చేశాం

సంక్షోభంలోకి వచ్చేశాం

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయ వనరులు దెబ్బతిన్నప్పటికీ పేదల కోసం ఖర్చు చేయడమే సరైన పని అని రఘురాం రాజన్ అన్నారు. రేటింగ్ డౌన్ గ్రేడ్‌లకు ఆందోళన చెందవద్దని, వాటి గురించి పట్టించుకోకుండా మరింత ఖర్చు చేయాలన్నారు. మనం ఇప్పటికే సంక్షోభంలోకి వచ్చేశామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక లోటు భారీగపెరిగిందన్నారు.

వారు మనుగడ సాగించేలా..

వారు మనుగడ సాగించేలా..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, అలాగే నాన్ శాలరైడ్ మధ్య తరగతి కుటుంబాలు మనుగడ సాగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. కుటుంబాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సుఫర్‌ను కొద్ది నెలలు చేయాలని, దీనిని పెంచాలన్నారు. లేదంటే వలస కార్మికులు, పేదలు ఇబ్బంది పడతారన్నారు. లేదంటే వారు లాక్ డౌన్‌ను ఉల్లంఘించి పనిలోకి వస్తారన్నారు.

2008-09 కంటే దారుణం

2008-09 కంటే దారుణం

2008-09 ఆర్థిక సంక్షోభం సమయంలో వర్కర్లు పనికి వెళ్తున్నారని, ఉద్యోగులు ఉద్యోగాలకు వెళ్లారని, ఆర్థిక వృద్ధి బాగుందని, ఫైనాన్షియల్ సిస్టం బాగుందని కానీ ఇప్పుడు అవి కూడా లేవని రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2008లో అంతకుముందు వృద్ధి రేటుతో నెట్టుకు వచ్చామన్నారు. సరైన సంకల్పం, చర్యల ద్వారా కరోనా మహమ్మారిని మనం ఓడించవచ్చునన్నారు.

మోడీ ఆలోచన.. రఘురాం రాజన్ సూచన

మోడీ ఆలోచన.. రఘురాం రాజన్ సూచన

దేశాన్ని ఎక్కువ కాలం పూర్తిగా లాక్ డౌన్ చేయడం కష్టమని రఘురాం రాజన్ అన్నారు. కొన్ని జాగ్రత్తలతో తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయవచ్చునని చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితమే ఈ హింట్ ఇచ్చారు. జాగ్రత్తలతో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు రఘురాం రాజన్ కూడా అదే సూచన చేస్తున్నారు.

నిరుద్యోగం పెరిగితే.. హెచ్చరిక

నిరుద్యోగం పెరిగితే.. హెచ్చరిక

నిరుద్యోగం పెరిగితే రిటైల్ రుణాలు, నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని రాజన్ హెచ్చరించారు. లిక్విడిటీ మరింత అవసరమన్నారు. మంచిగా పని చేసే ఎన్బీఎఫ్‌సీలకు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు డివిడెండ్ చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని విధించడంపై దృష్టి సారించాలని, అప్పుడు మూలధన నిల్వలు పెరుగుతాయన్నారు.

అప్రధాన్య ఖర్చులు తగ్గించాలి

అప్రధాన్య ఖర్చులు తగ్గించాలి

తక్కువ ప్రాముఖ్యత కలిగిన ఖర్చులకు ప్రాధాన్యత తగ్గించాలని సూచించారు. తక్షణ అవసరాలపై దృష్టి సారించాలన్నారు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

రాజకీయాలు పక్కన పెట్టాలి

రాజకీయాలు పక్కన పెట్టాలి

దేశంలో సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే బలమైన సంస్కరణలు చేయగలుగుతుందని, లేదంటే ఆర్థికంగా బలహీనంగా మారిపోతామని రాజన్ అన్నారు. క్లిష్టమైన ఆర్థిక, ఆరోగ్య సంస్కరణలపై మన రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లాక్ డౌన్‌కు సమర్థన

లాక్ డౌన్‌కు సమర్థన

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిపుణుల పైన మాత్రమే ఆధారపడడం సరికాదని రాజన్ అన్నారు. కరోనా పేరుతో వారిపై మరింత భారం వేయడం మంచిది కాదన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్‌ను సమర్ధించారు.

రాజన్ ముఖ్యసూచనలు..

రాజన్ ముఖ్యసూచనలు..

కరోనా పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ నెల 14 తర్వాత వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించాలి. అందుకోసం వెంటనే ఏర్పాట్లు చేయాలి. పని ప్రదేశాలకు దగ్గరలోని హాస్టళ్లలో ఉండే ఆరోగ్యవంతులైన యువకులను పనులలోకి తీసుకోవాలి. నిరుపేదలు, తక్కువ జీతాలతో పని చేసే అట్టడుగు మధ్య తరగతి ప్రజలకు జీవిత భద్రత కల్పించాలి. నగదు బదిలీ కింద ప్రస్తుతం ఇస్తున్న సాయం మరింత పెంచాలి.

English summary

India facing greatest emergency since Independence: Raghuram Rajan

The government should prioritise spending on the poor, and cut back on or delay less important expenditure, former RBI chief Raghuram Rajan has said, describing the coronavirus pandemic as the greatest emergency since Independence.
Story first published: Monday, April 6, 2020, 12:20 [IST]
Company Search