ఐఎంఎఫ్ భారత వృద్ధి రేటు అంచనాలు 9 శాతం, FY23లో 7.1 శాతం
కరోనా ఒమిక్రాన్ కారణంగా భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF). మార్చి 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి భారత వృద్ధి రేటు అంచనాలను 9 శాతానికి తగ్గించింది. ఈ వాషింగ్టన్ ఆధారిత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ గత అక్టోబర్ నెలలో భారత జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు దీనిని 9 శాతానికి తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 7.1 శాతంగా అంచనా వేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా భారత వృద్ధి రేటు 7.3 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.
గవర్నమెంట్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా వేసిన అంచనా కంటే ఐఎంఎఫ్ అంచనా (9 శాతం) తక్కువే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 9.5 శాతంగా అంచనా వేసింది. అలాగే ఎస్ అండ్ పీ వేసిన 9.3 అంచనా కంటే కూడా ఐఎంఎఫ్ అంచనాలు తక్కువ. మూడీస్ మాత్రం 8.3 శాతంగా అంచనా వేసింది.

ఐఎంఎఫ్ ప్రకారం 2022 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాల్లో ఎక్కువ వాటా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా ఉంటాయి. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.