ICICI Update: క్రెడిట్ కార్డు ఛార్జీల పెంపు, ఇప్పటికే అమల్లోకి
ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డు ఫీజులను పెంచింది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే అమలులోకి వచ్చింది. చెక్కు తిరిగి వచ్చినప్పటికీ బకాయి మొత్తంలో 2 శాతంతో బ్యాంకు కనీసం రూ.500 వసూలు చేస్తుంది.
అనుమతించిన తేదీ తర్వాత రూ.50,000 పైగా బకాయి ఉండే మొత్తంపై రూ.1,200 లేట్ ఫీజు వసూలు చేస్తారు. రూ.100 లోపు బకాయి మొత్తానికి మాత్రం చార్జీ వర్తించదు. ఆ తర్వాత బకాయి మొత్తం పెరిగేకొద్ది రూ.100 నుండి రూ.1,200 వరకు లేట్ ఫీజు ఉంటుంది. కొత్త చార్జీలు ఫిబ్రవరి 10వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా సంస్థకు చెందిన అన్ని కార్డులకు ఈ పెంపు వర్తిస్తుంది.

Rs.100 లోపు బకాయి మొత్తం - No charge,
బకాయి మొత్తం Rs.100 నుండి Rs.500 - Rs.100 late fee,
బకాయి మొత్తం Rs.501 నుండి Rs.5,000 - Rs.500 late payment,
బకాయి మొత్తం Rs.5,001 నుండి Rs.10,00 - Rs.750 late fee,
బకాయి మొత్తం Rs.10,001 నుండి Rs.25,000 - Rs.900 late payment,
బకాయి మొత్తం Rs.25,011 నుండి Rs.50,000 - Rs.1,000 late payment,
బకాయి మొత్తం Rs.50,000 వరకు - Rs.1,200 late payment.