For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crore Salary: ఆస్ట్రేలియాలో కోటి రూపాయల జీతం..! కానీ ఉద్యోగులు లేరు.. పూర్తి వివరాలు..

|

చాలా మంది చాలా కష్టపడి పని చేస్తుంటారు. కానీ.. ఇప్పటికీ వారి జీతం వారు ఆశించిన దానికి అనుగుణంగా ఉండదు. కొంతమంది తమ డిగ్రీ లేదా అనుభవం ఆధారంగా ఉద్యోగం పొందాలని తహతహలాడుతుంటారు. అయితే ఆస్ట్రేలియాలో చాలా సాధారణ పనికి రూ. కోటి విలువైన ఉద్యోగం అందిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగులు దొరకటం లేదనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అవును ఇది నిజంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వార్త. అసలు దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఉద్యోగం ఏమిటి..?

ఉద్యోగం ఏమిటి..?

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. కానీ ఈ పని చేయడానికి అక్కడ ఉద్యోగుల కొరత ఉంది. ఆస్ట్రేలియాలో స్వీపర్‌కు.. మన దేశంలో డాక్టర్ లేదా ఇంజనీర్ కంటే ఎక్కువ జీతం చెల్లిస్తున్నారు. ఇంత భారీ శాలరీ ప్యాకేజీలు అందించటానికి ఉద్యోగుల కొరతే కారణంగా తెలుస్తోంది.

జీతం ప్యాకేజీ ఎంతంటే..

జీతం ప్యాకేజీ ఎంతంటే..

వాస్తవానికి కొన్ని క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు ఉద్యోగులకు కోటి రూపాయల వరకు జీతాలను అందిస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఈ ఫీల్డ్ కోసం ఎంత వెతికినా దొరకటం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పలు కంపెనీలు క్లీనింగ్ కార్మికుల జీతాలను పెంచాయి. ఈ పెంపు గంటల ప్రాతిపదికన ఉంది. ఈ పెంపుదల వల్ల ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.8,00,000 వరకు జీతం లభిస్తోంది.

98 లక్షల వార్షిక ప్యాకేజీ..

98 లక్షల వార్షిక ప్యాకేజీ..

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంత జీతాలు పెంచుతున్నప్పటికీ దేశంలో పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో లేకపోవటమే. ప్రస్తుతం ఉద్యోగులకు సగటు జీతం ప్యాకేజీ రూ. 72,00,000 నుంచి రూ. 80,00,000 వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఆస్ట్రేలియాలోని కొన్ని కంపెనీలు జీతాన్ని ప్రస్తుతం ఏడాదికి రూ.98,00,000కు పెంచేశాయి.

జీతం పెంచాలని ఒత్తిడి..

జీతం పెంచాలని ఒత్తిడి..

ఉద్యోగుల జీతాలు సర్వీస్ ఏజెన్సీలు మారినందున పెంచబడుతున్నాయని డైలీ టెలిగ్రాఫ్‌లోని ఒక నివేదిక వెల్లడించింది. సిడ్నీకి చెందిన క్లీనింగ్ కంపెనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వీస్ మాట్లాడుతూ.. స్కావెంజర్లు లేరని, కాబట్టి జీతాలు పెంచాలని అన్నారు. ఇప్పుడు శానిటరీ విభాగంలోని కార్మికులకు గంటకు 45 డాలర్ల జీతం చెల్లిస్తున్నారు. ఇది భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3,600కు సమానం.

గతంలో జీతాలు ఎలా ఉండేవి..?

గతంలో జీతాలు ఎలా ఉండేవి..?

ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కొరత 2021 వరకు కొనసాగుతోంది. ఏడాది క్రితం స్వీపర్‌కు గంటకు రూ.2,700 చెల్లిచేవారు. కానీ.. ప్రస్తుతం రూ.3,500-3,600 చెల్లిస్తున్నారు. కొన్ని కంపెనీలైతే ఏకంగా గంటకు రూ.4,700 వరకు పెంచాయి.

గతంలో బ్రిటన్ పరిస్థితులు..

గతంలో బ్రిటన్ పరిస్థితులు..

అయితే కొన్ని కంపెనీలు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ చెల్లించటానికి కూడా సిద్ధంగా ఉన్నాయనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కిటికీలు శుభ్రం చేయడానికి ఏడాదికి రూ.82 లక్షల వరకు జీతం అందుతోంది. ఒకప్పుడు బ్రిటన్ లోనూ ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు క్యాబేజీని కోయడానికి మాత్రమే సంవత్సరానికి రూ.65,00,000 జీతం ఇస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న ఇలాంటి నివేదికలు సంచలనం సృష్టించటంతో పాటు ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది.

English summary

Crore Salary: ఆస్ట్రేలియాలో కోటి రూపాయల జీతం..! కానీ ఉద్యోగులు లేరు.. పూర్తి వివరాలు.. | huge shortage for sanitary workers in australia even after salary offered annually goes to one crore know full details

huge shortage of these workers in australia even after salary offered was one crore annually
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X