For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్‌తో పోటీలో వాల్‌మార్ట్ గెలుపు వెనుక ఇండియన్ ఇంజినీర్స్.. ఎలాగంటే?

|

వాల్‌మార్ట్... ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ చైన్ కంపెనీ. అమెరికా కు చెందిన వాల్‌మార్ట్ అక్కడ అత్యంత ప్రముఖ బ్రాండ్ కూడా. తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయాలంటే అమెరికన్లు ముందు చెప్పే పేరు వాల్‌మార్ట్. 1962 లో స్థాపించిన ఈ కంపెనీకి ఒక నలభయ్ ఏళ్ళు తిరుగులేకుండా గడిచిపోయింది. కానీ 1994 లో జెఫ్ బెజోస్ అమెజాన్ కు పురుడు పోయటంతో కొత్త తలనొప్పి మొదలైంది. అయినా కొన్నేళ్ల వరకు అమెజాన్ ఆన్లైన్ బిజినెస్ తో వాల్మార్ట్ కు పెద్ద పోటీ రాలేదు. కానీ పరిణామ క్రమంలో అమెరికా లో దాదాపు అన్ని రిటైల్ కంపెనీలకు అమెజాన్ చుక్కలు చూపింది. దాంతో తట్టుకుని నిలబడలేక అవి చేతులెత్తేశాయి. విపరీతమైన ఆఫర్లు గుప్పించటం, ఇంటికే ప్రొడక్టులను ఉచితంగా డెలివరీ చేయటం... ఇదే అమెజాన్ మూల సూత్రం. ఏ వినియోగదారునికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? మిగితా రిటైలర్ల పని పట్టిన అమెజాన్... ఇక వాల్మార్ట్ తో పోటీ పడటం మొదలు పెట్టింది. నువ్వా నేనా అన్నట్లు ఇది తీవ్రతరమైంది. ఈ రెండు అతిపెద్ద రిటైల్ కంపెనీలు కేవలం అమెరికాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా పోటీ పడుతూనే ఉన్నాయి. కానీ, అమెజాన్ తో పోటీలో వాల్మార్ట్ గెలిచేందుకు తగిన వ్యూహాలు, టెక్నాలజీని సిద్ధం చేసి భారతీయ టెకీలు సాయం చేస్తున్నారు.

500 బిలియన్ డాలర్లు...

500 బిలియన్ డాలర్లు...

అమెజాన్ తో పోల్చితే ఇప్పటికీ వాల్మార్ట్ అతి పెద్ద కంపెనీ. సుమారు 500 బిలియన్ డాలర్ల రెవిన్యూ తో దాదాపు రెండింతలు ఉంటుంది. 2015 నుంచి తీవ్రతరమైన పోటీలో నిలదొక్కు కునేందుకు వాల్మార్ట్ ఇండియా ను ఆశ్రయించింది. బెంగళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ పరిశోధన & అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్అండ్ డీ ) ఏర్పాటు చేసింది. వాల్మార్ట్ లాబ్స్ పేరుతొ ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి హెడ్ హరి వాసుదేవ్. ఆయన నేతృత్వంలో ఈ సెంటర్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ఈయన వాల్మార్ట్ సప్లై చైన్ వ్యూహాలను అందించటంతో పాటు లాజిస్టిక్స్ సంస్థ ఈకార్ట్ కు మెరుగైన టెక్నాలజీ లు అందిస్తున్నారు. బిగ్ డేటా సహాయంతో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి వినియోగదారులకు బెస్ట్ ప్రైస్ అందించటం... వినియోగదారులకు ఓమ్ని-ఛానల్ అనుభూతిని కలిగించటం అనే రెండు ముఖ్య లక్ష్యాలతో ముందుకు వెళుతున్నట్లు అయన తెలిపారు. ఈ విషయాన్నీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో వెల్లడించింది.

ప్రతి రోజూ బెస్ట్ ప్రైస్ ...

ప్రతి రోజూ బెస్ట్ ప్రైస్ ...

వాల్మార్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే... తమ వినియోగరులకు ప్రతిరోజూ బెస్ట్ ప్రైస్ అందించటం. అందుకే వాల్మార్ట్ లాబ్స్ సొంతంగా కాంపిటీటివ్ ఇంటలిజెన్స్ అనలిటిక్స్ (సి ఐ ఏ ) పేరుతొ ఒక అత్భుతమైన మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీంతో పోటీదారులు అందించే ధరలను బేరీజు వేసుకుంటూ వాల్మార్ట్ లో అంతకంటే మెరుగైన ధరలను వినియోగదారులకు అందిస్తారు. దీంతో ప్రస్తుతం వాల్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11,300 స్టోర్లు, తన సొంత ఈకామెర్స్ ప్లాట్ ఫాంనకు రోజు 275 మిలియన్ల వినియోగదారులు వచ్చేలా చేయగలుగుతున్నారు. అంతే కాకుండా.. ఆన్లైన్ లో ఆర్డర్ చేసి, తీరిక ఉన్నప్పుడే స్టోర్ నుంచి తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక లాకర్ లాంటి టవర్ లో కస్టమర్ల ప్యాక్ లు స్టోర్ చేసి ఉంచుతారు. బార్ కోడ్ స్కాన్ చేసి ఎప్పుడంటే అప్పుడు వాటిని తీసుకెళ్లవచ్చు. అలాగే స్టోర్లలో కొనుగోలు చేస్తున్నప్పుడే ఆన్లైన్ లో ధరలు ఎలా ఉన్నారో చెక్ చేసుకుని, ఏది బెటర్ అయితే దాన్నే ఎంచుకోవచ్చు.

లో-కాస్ట్ డెలివరీ...

లో-కాస్ట్ డెలివరీ...

ఈకామెర్స్ రంగంలో అతి ముఖ్యమైన విషయం డెలివరీ. ఒక కస్టమర్ బుక్ చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఒకే ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ లో ఉండకపోవచ్చు. వాటిని మరో చోట నుంచి తెప్పించటం, అన్నిటినీ కలిపి ఒకే ప్యాక్ ద్వారా కస్టమర్ కు అందించటం ఒక సవాలు. అది కూడా తక్కువ ఖర్చులో డెలివరీ చేయగలిగితేనే మంచిది. లేదంటే వ్యయం పెరిగిపోయి నష్టాలు సంభవిస్తాయి. అందుకే, ఈ దిశగా కంపెనీ అనేక కొత్త టెక్నాలజీ లు ఉపయోగిస్తూ ముందుకు వెళుతోంది. అదే సమయంలో ఒక వస్తువు ఎక్సపైరీ డేట్ సమీపించినప్పుడు దానిపై ఎంత వరకు డిస్కౌంట్ ఇవ్వ వచ్చొ తెలుసుకునేలా వీటిని రూపొందించారు. ఏ సెల్లర్ లేదా ఏ స్టోర్ తన ప్రొడక్టులను మెరుగ్గా నిర్వహిస్తుందో తెలుసుకునే ఇన్సైట్స్ కూడా అభివృద్ధి చేసారు. వీటన్నిటికీ భారత్ లోని ఆర్ అండ్ డీ సెంటర్ తో పాటు ఇండియన్ టెక్నాలజీ నిపుణులు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ తో పోటీలో వాల్మార్ట్ ను ముందుంచుతున్నారు.

English summary

How Walmart's taking on Amazon, with help from Indian engineers

Amazon has hit almost every US retailer adversely. An exception has been Walmart. At over $500 billion in revenue, it remains more than twice as big as Amazon. In 2019, its share price rose 27%, much faster than Amazon’s and among the fastest in the Dow Jones index.
Story first published: Wednesday, February 5, 2020, 19:39 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more