For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారు మారుతోంది... గమనించారా?

|

అవును. మీరు చదివింది నిజమే. మనం వాడుతున్న కారు మారుతోంది! ఒకప్పుడు కారు అనేది లగ్జరీ. ఇప్పుడది తప్పనిసరి. ఆర్థిక సరళీకరణ పుణ్యమా అని ప్రజల ఆదాయం పెరుగుతోంది. జీవన విధానం కూడా అందుకు తగ్గట్లు మారిపోతోంది. పల్లెలు పట్టణాలకు వలస వెళుతున్నాయి. పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామ క్రమంలో కారుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కళలు, క్రీడలు, రాజకీయాలు... ఏ రంగంలో పని చేస్తున్న వారు అయినా వారి వారి పనుల్లో వేగం పెరిగిపోయింది. అదే సమయంలో హుందాతనం వచ్చి చేరింది.

అందుకే, కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కార్లు ఉపయోగించాలన్న నియమాలు ఇప్పుడు లేవు. రోజువారీ అవసరాలు, కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు కార్లు మెరుగైన రవాణా సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందుకే పట్టణాల్లో ప్రతి ఇంటిలో ఒక కారు తప్పనిసరి ఐంది. అయితే, తొలినాళ్లలో కారులో కొన్ని సదుపాయాలు మాత్రమే ఉండేవి. కనీసం ఏసీ సదుపాయం కూడా లేని కార్లను కూడా చూశాం. కానీ ప్రస్తుతం కార్లలో సకల సదుపాయాలు లభిస్తున్నాయి.

Flipkart Sale: రూ.3,000 నుంచి రూ.50వేల వరకు భారీ తగ్గింపు

చిన్న కార్లలో పెద్ద ఫీచర్లు...

చిన్న కార్లలో పెద్ద ఫీచర్లు...

ఒకప్పుడు మెర్సిడిస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలాసవంతమైన కార్ల లో మాత్రమే కనిపించే సౌకర్యాలు, హంగులు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కార్లలో కూడా లభిస్తున్నాయి. ఎందుకంటే, ప్రజల జీవన విధానం మారిపోతోంది కాబట్టి. ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా మన రోజు గడవదు. కాబట్టి, కార్లలో కూడా మొబైల్ ఫోన్ వంటి ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సెన్సార్లు, వాయిస్ కమాండ్లతో పనిచేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన మారుతి ఆల్టో కారులో కూడా ఇటీవల అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎయిర్ బాగ్, ఎంటర్టైన్మెంట్ సిస్టం, సెన్సార్ ఆధారిత ఫీచర్స్ ఉంటున్నాయి. మీరు ఇటీవల మార్కెట్లోకి వస్తున్న అన్ని మోడల్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ... ప్రతి మోడల్ లోనూ కొత్త హంగులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో భద్రతకు పెద్ద పీటవేస్తున్నారు.

ఫిక్షన్ సినిమాలా...

ఫిక్షన్ సినిమాలా...

ఇంగ్లీష్ ఫిక్షన్ సినిమాలో కనిపించే అద్భుత కార్లు... మరికొన్ని రోజుల్లోనే మనం రోడ్లపై చూడబోతున్నాం. ఇప్పటికే ప్రతి కారు లోనూ డిజిటల్ టెక్నాలజీ ప్రభావం పెరిగిపోయింది. అది కారు కంటే కూడా ఒక స్మార్ట్ డివైస్ లాగా రూపాంతరం చెందుతోంది. మరీ ముఖ్యంగా గూగుల్, ఉబెర్ వంటి కంపెనీలు అయితే, డ్రైవర్ లేకుండా నడిచే కార్లను తయారు చేసారు. వాటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అవి గనుక రోడ్లపైకి వస్తే ఇక మనం మరో లోకంలో ఉన్నట్లే. కారులో కూర్చొని, మ్యాప్లో డెస్టినేషన్ సెట్ చేస్తే చాలు కారు మనల్ని ఆ ప్రాంతానికి సేఫ్ గా తీసుకెళుతుంది. ఈ ప్రయాణ సమయంలో మనకు నచ్చిన సినిమా చూస్తునో, మ్యూజిక్ వింటూనూ, బుక్స్ చదువుతూనో, లేదంటే లాప్టాప్ పై ఆఫీస్ పని చేస్తూనో గడిపేయవచ్చు. ఇక్ పొతే త్వరలోనే ఎగిరే కార్లు (ఫ్లైయింగ్ కార్స్) వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయి అభివృద్ధి కూడా పూర్తయింది. బోయింగ్, పోర్షే వంటి కంపెనీలు ఈ మేరకు కలిసి పనిచేస్తున్నాయి.

మెకానిక్ లో మారాల్సిందే...

మెకానిక్ లో మారాల్సిందే...

ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇండియా లో కార్ల కొనుగోలు వేగం పెరిగింది గత 20 ఏళ్లలోనే. అయినప్పటికీ... మన దేశంలో ఇప్పుడు దొరకని కారు లేదు. అమ్మని కంపెనీ లేదు. అందుకే, మన దేశీయ కార్ల తయారీ కంపెనీలు మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు కూడా గ్లోబల్ టెక్నాలజీలు అందిపుచ్చుకొంటున్నాయి. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో కార్లను విక్రయించే మార్కెటింగ్, సేల్స్ టీం లు కూడా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సి వస్తోంది. కార్ల లో వచ్చే ఫీచర్లు, వాటి ఉపయోగాలు వివరించాలంటే వారికి దానిపై పట్టు ఉండాల్సిందే. అదే సమయంలో కార్లను రిపేర్ చేసే మెకానిక్ లు మరీ కీలకం. ఎందుకంటే, కార్లలో వచ్చే ప్రతి మార్పును వారు కూలంకషంగా అర్థం చేసుకోవాలి. లేదంటే దానికి రిపేర్ చేయలేరు. మార్కెట్లో నిలదొక్కుకోలేరు. అందుకే కారు తో పాటు అన్ని విభాగాలు మార్పుకు లోనవుతున్నాయి.

లక్షల్లో కొత్త కార్లు..

లక్షల్లో కొత్త కార్లు..

కార్ల విక్రయాల్లో 2019 మాత్రం కొంత నిరుత్సహ పరిచినా... అందుకు తగిన కారణాలు ఉన్నాయి. దేశంలో ఆర్థిక మందగమనం నెలకొనటంతో పాటు ప్రభుత్వ నిబంధనలు మారుతుండటంతో వినియోగదారులు కొత్త కార్ల కొనుగోలు విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నిబంధనలు కూడా కార్ల విక్రయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. ఇదిలా ఉంచితే, ఇండియాలో సగటున ప్రతి ఏటా సుమారు 30,00,000 కు పైగా కొత్త పాసెంజర్ వాహనాలు (కార్లు, ఎస్ యూ వి ) అమ్ముడవున్నాయి. ఇందులో మారుతి సుజుకి ఒక్కటే దాదాపు సగం కార్లను విక్రయిస్తోంది. అయితే, మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి కొత్త మోడల్ ఇప్పుడొక డిజిటల్ కారుగా అందుబాటులోకి వస్తోంది. అన్ని ఫీచర్లను ఎంజాయ్ చేస్తూ, పొల్యూషన్ తగ్గించేలా మనవంతు సాయం చేద్దామా మరి?

English summary

How India's car market is undergoing a rapid change

Digital technologies are making cars more rich in features. Even small cars like alto also becoming smart by introducing latest features like sensors, voice commands etc. since, cars are changing themselves in terms of features, the mechanics and sales people are also upgrading themselves with the latest technology skills.
Story first published: Sunday, January 19, 2020, 19:58 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more