రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
ముంబై: రెండు రోజుల పాటు భారీ నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 19, మంగళవారం) జంప్ చేశాయి. దాదాపు రెండు రోజుల నష్టం నుండి బయటపడ్డాయి. సెన్సెక్స్ గతవారం చివరి సెషన్లో 550 పాయింట్లు, నిన్న 470 పాయింట్లు... మొత్తం 1000 పాయింట్లు నష్టపోగా, ఈ రోజు ఒక్కరోజే 834 పాయింట్లు లాభపడటం గమనార్హం. మార్కెట్లు ఉదయం నుండి లాభాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను కిందకు పడిపోలేదు. పైగా అంతకంతకూ పెరిగాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ముగిశాయి.
Budget 2021-22: కరోనా వ్యాక్సీన్ కోసం ఖర్చులు, సంపన్నులపై కరోనా సెస్?

మార్కెట్ బౌన్స్ బ్యాక్
మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. సెన్సెక్స్ 834.02 పాయింట్లు లేదా 1.72% ఎగబాకి 49,398.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 239.90 పాయింట్లు లేదా 1.68% ఎగిసి 14,521.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 2077 షేర్లు లాభాల్లో, 861 షేర్లు నష్టాల్లో ముగియగా, 139 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 48,900 వద్ద ప్రారంభమై, 49,499.86 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 48,805 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి, చివరకు 49,398 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,371.65 వద్ద ప్రారంభమై, 14,478.45 వద్ద గరిష్టాన్ని, 14,350.85 వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంతో రూపాయి 73.17 వద్ద క్లోజ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నిఫ్టీ స్టాక్స్‌లో 42 మంచి లాభాల్లో ముగిశాయి. HDFC, HDFC బ్యాంకు, ICICI RIL వంటి హెవీ వెయిట్స్ లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. నిఫ్టీ బ్యాంకు 613 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ సూచీ 499 పాయింట్లు లాభపడింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 6.82 శాతం, టాటా మోటార్స్ 5.16 శాతం, బజాజ్ ఫైనాన్స్ 5.07 శాతం, HDFC 3.52 శాతం, హిండాల్కో 3.45 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 0.58 శాతం, ఐటీసీ 0.41 శాతం, విప్రో 0.30 శాతం, బ్రిటానియా 0.18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.12 శాతం నష్టపోయాయి.
టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ పైనాన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 1.57 శాతం లాభపడి రూ.2015 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ స్టాక్ 1.36 శాతం లాభపడి రూ.3265 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 1.68 శాతం లాభపడగా, మిడ్ క్యాప్ 1.71 శాతం ఎగిసింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.97 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.93 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.46 శాతం, నిఫ్టీ ఐటీ 0.49 శాతం, నిఫ్టీ మీడియా 2.49 శాతం, నిఫ్టీ మెటల్ 2.92 శాతం, నిఫ్టీ ఫార్మా 1.68 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.69 శాతం, నిఫ్టీ రియాల్టీ 4.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.02 శాతం లాభపడ్డాయి.