HDFC Q3 results: వేల కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను ఆర్జించిన ప్రైవేట్ లీడ్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ సెక్టార్లో అతి పెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హెచ్డీఎఫ్సీ).. తన మూడో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించి రాణించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 18.1 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.
మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 18.1 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను రికార్డు చేసింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలానికి 10,342 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే.. నెట్ ప్రాఫిట్ మరింత మెరుగుపడింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 8,758 కోట్ల రూపాయలను నమోదు చేయగా.. ఈ ఏడాది అదే కాలానికి 10,342 కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను అందుకుంది.

మొత్తంగా ఈ మూడో త్రైమాసికంలో 40,65160 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించింది. గత ఏడాది ఇదే కాలానికి నిర్వహించిన ఆర్థిక కార్యకలాపాల విలువ 37,522 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే..థర్డ్ క్వార్టర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఈ ఏడాది జులై-ఆగస్టు-సెప్టెంబర్ కాలానికి 8,834 కోట్ల రూపాయలు కాగా ఆ తదుపరి మూడు నెలల కాలానికి ఈ మొత్తం 10,342 కోట్ల రూపాయలకు చేరింది.
బ్యాంక్ ఆధీనంలో ఉన్న నిరర్ధక ఆస్తుల విలువ 1.26గా నమోదైంది. రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువే. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ చెల్లింపులు-రాబడి మధ్య తేడా పెరిగింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ 13 శాతం మేర పెరిగి.. 26,627 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 23,760 కోట్ల రూపాయలే. అడ్వాన్సుల చెల్లింపుల్లో పురోభివృద్ధిని కనపరిచింది.