హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాలు ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజానికి కిక్ ఇచ్చాయి.హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నికర లాభం 18% పెరిగి, 8,758.3 కోట్లకు, ఆస్తి నాణ్యత మెరుగుపడటంతో బ్యాంకింగ్ దిగ్గజం వరుసగా లాభాల బాటలో పయనిస్తోంది .

8758.3 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించిన హెచ్‌డిఎఫ్‌సి
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత,అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజమైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జనవరి 16, శనివారం 8758.3 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 18.1 పెరుగుదలను సూచిస్తుంది. బ్యాంకు మొత్తం ఆదాయం స్వతంత్ర ప్రాతిపదికన, 37,522 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో, 36,039 కోట్లతో పోలిస్తే మూడవ త్రైమాసికంలో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ త్రైమాసికం ముగింపులో 1.08 శాతంగా ఎన్‌పిఎ నిష్పత్తి
అంతేకాదు వడ్డీయేతర ఆదాయంతో పాటు మెరుగైన ఆస్తి నాణ్యత పనితీరుతో ప్రీ-ప్రొవిజన్ ఆపరేటింగ్ లాభంతో నడిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకారం, ఎన్‌పిఎ నిష్పత్తి మొత్తం ఆస్తులలో 0.81 శాతంగా ఉంది, అంతకుముందు ఏడాది కాలంలో ఇది 1.42 శాతంగా ఉంది . అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికం ముగింపులో 1.08 శాతంగా ఉంది.
అంతకుముందు త్రైమాసికంలో కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జూలై-సెప్టెంబర్ లాభం 18% పెరిగి 7,513 కోట్ల రూపాయలకు చేరుకుంది.

జూలై-సెప్టెంబర్ నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16.73% పెరుగుదల
జూలై-సెప్టెంబర్ నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16.73% పెరిగింది .
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7,513.11 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 18.41 శాతం పెరిగింది. కరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగే మందగమనం కస్టమర్ డిఫాల్ట్‌ల సంఖ్య పెరుగుదలకు దారితీయవచ్చు అని భావించినా త్రైమాసికంలో కూడా నికర లాభం గణనీయంగా పెరిగింది.