For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ భయంతో కంపెనీలకు బ్యాంకులు దూరం, అందుకే మోడీ ప్రభుత్వం 'తప్పనిసరి' చర్య

|

వివిధ కారణాలతో చిన్న సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కరోనా కారణంగా ప్రపంచమే అతలాకుతలం అవుతోంది. 50 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అసలే ఆసక్తి కనబరచవు. ఎందుకంటే కరోనా కారణంగా చిన్న సంస్థలు చితికిపోయాయి. రుణాలు ఇస్తే పరిస్థితి ఏమిటో తెలియదు. కాబట్టి దూరం జరుగుతాయి. ఈ నేపథ్యంలో లక్షలాది చిన్న కంపెనీలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా లక్షల కోట్ల రుణాలు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టిందని చెబుతున్నారు.

నగదు బదలీ ఉంటేనే.. నిర్మల సీతారామన్ ప్యాకేజీపై అసంతృప్తినగదు బదలీ ఉంటేనే.. నిర్మల సీతారామన్ ప్యాకేజీపై అసంతృప్తి

రుణాల కంటే భద్రత దిశగా బ్యాంకుల ఆలోచన

రుణాల కంటే భద్రత దిశగా బ్యాంకుల ఆలోచన

కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకులు కూడా సెంట్రల్ బ్యాంకులో నిధులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే భద్రత వైపు ఆలోచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం చిన్న సంస్థలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తామని ప్రకటించడం ద్వారా భారీ ఊరట కల్పించాయి. రుణాలు ఇవ్వడానికి లిక్విడిటీ మొత్తం లేదా వడ్డీ ప్రధానం కాదని, రిస్క్ అంశమని సుబ్బారావు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం చిన్న కంపెనీలకు రుణాలు ఇచ్చి సాంత్వన చేకూర్చే దిశగా చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్రం 12 నెలల పాటు గ్యారెంటీ కూడా ప్రభుత్వమేనని చెప్పింది.

రుణాలు లేక అల్లాడే పరిస్థితి

రుణాలు లేక అల్లాడే పరిస్థితి

బ్యాడ్ లోన్స్, ఎన్పీఏ వంటి వివిధ కారణాలతో భారతీయ బ్యాంకులు గత కొంతకాలంగా బలహీనపడుతున్నాయి. లాక్ డౌన్ వల్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరోనా - లాక్ డౌన్ వల్ల నిరుద్యోగిత రేటు 27 శాతానికి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 2 శాతం నుండి 3 శాతానికి పడిపోయి, దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సంస్థలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపించకపోవడం వాటికి ఆందోళన కలిగిస్తోంది. ఓ సర్వే ప్రకారం ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు కలిగిన ఈ సంస్థలు రుణాల కారణంగా ఇబ్బందులు పడే పరిస్థితి.

ప్రభుత్వం తీరుతో కొంత విజయం

ప్రభుత్వం తీరుతో కొంత విజయం

ప్రభుత్వం తీరుతో కొంతమేర విజయం సాధించవచ్చునని బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రథి చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా అన్నారు. ప్రభుత్వం ప్రకటనతో నాలుగేళ్లలో 40 బిలియన్ డాలర్ల రుణ హామీని కలిగి ఉంటుందని, 4.5 మిలియన్ల సంస్థలకు లబ్ధి చేకూరుతుందని, 12 నెలలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత డిఫాల్టర్లు ఉంటే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం హామీతో చిన్న సంస్థలకు రుణ హామీ లభిస్తుందంటున్నారు.

రిస్క్ తీసుకోవడానికి దూరం

రిస్క్ తీసుకోవడానికి దూరం

అయితే ఇది దేశంలోని 63 మిలియన్ల చిన్న కంపెనీలలో పదోవంతు కంటే తక్కువకు సాయం అందుతుందన్నారు. మిగతా కంపెనీలపై రిస్క్ తీసుకోకపోవడం వల్ల 20 మిలియన్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే బ్యాడ్ లోన్స్‌తో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అంటే ఇంకా నష్టాలు భరించేందుకు సిద్ధంగా లేవు.

ప్రభుత్వ చర్యల వల్ల రుణాలు ఇచ్చినా.. 'జాగ్రత్త'

ప్రభుత్వ చర్యల వల్ల రుణాలు ఇచ్చినా.. 'జాగ్రత్త'

లాక్ డౌన్ సమయంలో కార్పోరేట్ రంగానికి లైఫ్ లైన్ ఇచ్చేందుకు ఆర్బీఐ నిధులను ఇన్ఫ్యూజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవచ్చు. షాడో రుణదాతలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు.. బ్యాంకులు చేరుకోలేని, బ్యాంకులు ఇవ్వలేని వారికి రుణాలు ఇచ్చి వ్యవస్థకు అండగా ఉంటున్నాయి. ప్రభుత్వ చర్యల వల్ల కొన్ని చిన్న సంస్థలకు నిధులు లభించినా 'జాగ్రత్తలు' పాటించే ఆస్కారం ఉందని చెబుతున్నారు.

English summary

ఆ భయంతో కంపెనీలకు బ్యాంకులు దూరం, అందుకే మోడీ ప్రభుత్వం 'తప్పనిసరి' చర్య | Government has been forced to rescue small businesses as banks are refusing to lend

India’s battle-scarred bankers are hoarding cash and reluctant to lend to smaller firms, forcing the government to ride to the rescue of millions of companies struggling for survival during the nationwide lockdown.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X