ప్రభుత్వాలపై తలకుమించి 'రుణ'భారం, 1980 తర్వాత తొలిసారి
కరోనా వైరస్ భారత్తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు రుణాలు తీసుకువచ్చి గట్టెక్కించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో భారత రుణ రేటు 91 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. 1980 తర్వాత జీడీపీలో రుణరేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి అవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. జీడీపీలో రుణ నిష్పత్తి ప్రభుత్వం చేసే ఖర్చులను పరిమితం చేస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వ్యయంపై ప్రభావం చూపుతుంది.
రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!

91 శాతానికి జీడీపీలో రుణ రేటు
మోతీలాల్ ఓస్వాల్ సర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ(కేంద్రం, రాష్ట్రాలు) రుణాలు జీడీపీతో 75శాతానికి చేరుకున్నాయి. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 91 శాతానికి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 91.3 శాతానికి చేరుకోవచ్చునని నివేదిక తెలిపింది. ఈ రుణ నిష్పత్తి దేశం తన రుణాన్ని తీర్చడానికి ఎంత అవకాశం ఉందో చూపిస్తుంది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉందని భావించవచ్చు. పెట్టుబడిదారులు ఈ నిష్పత్తితో ఓ అంచనాకు వస్తారు.