For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: అదానీని నమ్మిన ఎల్ఐసీ.. ఎడాపెడా పెట్టుబడులు.. పూర్తి వివరాలు..

|

LIC: ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ సొమ్మును వివిధ ప్రభుత్వ ఆస్తులతో పాటు కంపెనీల్లో సైతం పెట్టుబడులను పెడుతుందని మనందరికీ తెలిసిందే. కానీ గడచిన రెండు సంవత్సరాలుగా ఎల్ఐసీ తన పెట్టుబడులను అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎక్కువగా పెడుతోంది. ఈ క్రమంలో నాలుగింతలైన పెట్టుబడి గురించిన వార్తలు మార్కెట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

గడచిన రెండేళ్లుగా..

గడచిన రెండేళ్లుగా..

సెప్టెంబర్ 2020 నుంచి అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగింటిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే మెుత్తం ఏడు కంపెనీల్లో ఎల్ఐసీకి మెుత్తంగా రూ.74,142 కోట్లు విలువైన పెట్టుబడులు ఉన్నాయి. అదానీ గ్రూప్ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ లో ఎల్ఐసీ అత్యధికంగా వాటాల పెరుగుదలను చూసింది. ఈ కంపెనీలో 2020 సెప్టెంబరున 1 శాతం పెట్టుబడులు కలిగి ఉండగా.. సెప్టెంబర్ 2022 నాటికి అది 5.77%కి పెరిగింది.

 మిగిలిన అదానీ కంపెనీలు..

మిగిలిన అదానీ కంపెనీలు..

ఇదే క్రమంలో అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీ వాటా 1% కంటే తక్కువ నుంచి 4.02%కి పెరిగింది. అలాగే అదానీ ట్రాన్స్‌మిషన్‌లో దాని హోల్డింగ్స్ 2.42% నుంచి 3.46%కి చేరుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో 1% కంటే తక్కువ వాటాలను ఎల్ఐసీ సెప్టెంబర్ 2022 నాటికి 1.15%కి పెంచుకుంది.

మిగిలిన కంపెనీల్లో..

మిగిలిన కంపెనీల్లో..

అదానీ గ్రూప్ లోని అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ విల్మార్ కంపెనీల్లో మాత్రం ఎల్ఐసీ తన వాటాలను గణనీయంగా పెంచలేదు. అలాగే దేశంలోని దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిన మూడవ అతిపెద్ద సంస్థ అదానీ గ్రూప్ కావటం గమనార్హం. ఈ క్రమంలో ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కంపెనీల కంటే ఎక్కువగానే అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అవును మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల పెట్టుబడి కంటే ఎల్ఐసీ 4.9 రెట్లు ఎక్కువ వాటాలను కొనుగోలు చేసింది.

 అదానీ గ్రూప్ విస్తరణ..

అదానీ గ్రూప్ విస్తరణ..

సమాచారం ప్రకారం ఎల్ఐసీ ప్రతి త్రైమాసికంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ లో తన పెట్టుబడులను పెంచుతోంది. అయితే పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసీ ఈక్విటీ పెట్టుబడులు పారదర్శకంగా ఉండాలని.. అయితే అదానీ స్టాక్‌లలో ఈ పెట్టుబడులు ఆ సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయని ఒక సలహాదారు వెల్లడించాడు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ బొగ్గు, సిమెంట్ నుంచి విమానాశ్రయాలు, రక్షణ వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించింది.

 క్రెడిట్ రేటింగ్ సంస్థ..

క్రెడిట్ రేటింగ్ సంస్థ..

2019 వరకు తక్కువ లాభాలు ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ విస్తరణను మాత్రం ఆపలేదు. అయితే ఆగస్టులో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అదానీ గ్రూప్ అనేక వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడంపై ఒక రిపోర్ట్ అందించింది. ఇది కంపెనీపై రుణాల భారాన్ని పెంచుతోందని అభిప్రాయపడింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అదానీ గ్రూప్ అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ అప్పట్లో తన నివేదికలో పేర్కొంది.

Read more about: lic adani investments stock market
English summary

Adani: అదానీని నమ్మిన ఎల్ఐసీ.. ఎడాపెడా పెట్టుబడులు.. పూర్తి వివరాలు.. | Government controlled LIC Investing Heavily In Adani Group Listed Companies Know details

Government controlled LIC Investing Heavily In Adani Group Listed Companies Know details
Story first published: Sunday, December 4, 2022, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X