Gold Rates Today: నిన్న భారీగా పెరిగి, నేడు తగ్గిన బంగారం ధరలు
క్రితం సెషన్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా క్షీణించాయి. నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.235 పెరిగి రూ.47,690 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.265 పెరిగి రూ.47,823 వద్ద ముగిసింది. అయితే నేడు మాత్రం అతి స్వల్ప తగ్గుదల లేదా స్థిరంగా ఉంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో రూ.51 తగ్గి రూ.47,638 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,823 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు భారీగా పెరిగాయి. పసిడి మళ్లీ 1800 డాలర్ల పైకి చేరుకుంది.

1800 డాలర్ల పైకి పసిడి
రెండు రోజుల క్రితం 1800 డాలర్ల దిగువన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న మాత్రం 20 డాలర్లకు పైగా లాభఫడి ఈ మార్కును క్రాస్ చేసింది. నిన్న ఏకంగా 1818 డాలర్ల పైన ముగిసింది. నేడు ప్రారంభమే 1821 డాలర్ల వద్ద కనిపించింది. కామెక్స్‌లో ఏడాదిలో పసిడి ధర 2.67 శాతం క్షీణించింది. 52 వారాల గరిష్టం 1922 డాలర్లు, 52 వారాల కనిష్టం 1680 డాలర్లు. నేటి సెషన్లో 1818 డాలర్ల నుండి 1822 డాలర్ల మధ్య కదలాడింది.

సిల్వర్ ఫ్యూచర్స్..
వెండి ధరలు స్వల్పంగా తగ్గి, రూ.61,000 స్థాయిలో ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.73 తగ్గి రూ.61,030 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,745 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో 22.812 డాలర్ల వద్ద ముగిసిన సిల్వర్ ప్యూచర్స్ నేటి సెషన్లో స్వల్పంగా తగ్గి 22.793 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 22.742 డాలర్ల నుండి 22.830 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో సిల్వర్ 10.58 శాతం క్షీణించింది.

వివిధ నగరాల్లో ధరలు
22 క్యారెట్ల బంగారం ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,870, ముంబైలో రూ.46,590, ఢిల్లీలో రూ.46,650, కోల్‌కతాలో రూ.46,850, బెంగళూరులో రూ.44,700, హైదరాబాద్‌లో రూ.44,700, విశాఖపట్నంలో రూ.44,700, విజయవాడలో రూ.44,700గా ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరగడం, ప్రపంచవ్యాప్తంగా వినియోగ డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి.