బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
ముంబై: బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గతవారం రూ.50,000 దిగువకు వచ్చిన పసిడి అక్కడే కొనసాగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా పెరిగి రూ.49,000కు సమీపంలో ఉంది. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,350 వరకు తక్కువగా ఉంది. కరోనా కేసులు, వ్యాక్సీన్, అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి.

49,000 దిగువనే పసిడి
నేడు సాయంత్రం సెషన్‌కు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 179.00 (-0.37%) పెరిగి రూ.48,881.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,995.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,608.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7350 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 235.00 (0.48%) పెరిగి రూ.48,950.00 వద్ద ఉంది. రూ.48,662.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,100.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,626.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 659.00 (1.02%) పెరిగి రూ.65423.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,055.00 వద్ద ప్రారంభమై, రూ.65,703.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,785.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.684.00 (1.04%) పెరిగి రూ.66300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,892.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.65755.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగినా 1850 డాలర్లకు దిగువనే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికీ 1850 డాలర్లకు దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.00 (+0.44%) డాలర్లు పెరిగి 1,837.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,803.60 - 1,839.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.74% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.201 (+0.81%) డాలర్లు తగ్గి 25.067 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.220 - 25.200 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 35.42శాతం పెరిగింది.