అదిరిపోయే న్యూస్: రూ.45,766కు వచ్చిన బంగారం ధర, వెండి రూ.1600 డౌన్
బంగారం, వెండి ధరలు నేడు (ఫిబ్రవరి 26, శుక్రవారం) దారుణంగా పతనమయ్యాయి. పసిడి రూ.500 వరకు తగ్గి రూ.46,000 దిగువకు వచ్చింది. వెండి రూ.67,000 స్థాయిలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1720 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు ఒక్కరోజే దాదాపు 60 డాలర్లు పడిపోయింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,500 తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో రూ.68వేలకు దిగువకు వచ్చింది.

రూ.46,000 దిగువకు పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు భారీగా తగ్గింది. ఏకంగా రూ.46,000 దిగువకు పడిపోయింది. నేడు సాయంత్రం సెషన్‌కు ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.475.00 (1.03%) తగ్గి రూ.45,766.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,340.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,849.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,708.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,500 తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.440.00 (0.95%) తగ్గి రూ.45,955 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,413 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,800 వద్ద గరిష్టాన్ని, రూ.45,912 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1600 తగ్గిన వెండి
వెండి ధరలు భారీగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,605.00 (-2.32%) తగ్గి రూ.67,671.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,505.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.1,527.00 (-2.16%) తగ్గి రూ.69,149.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,388.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,737.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయంగా దారుణ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఏకంగా 1700 డాలర్ల స్థాయికి వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -56.55
(-3.19%) డాలర్లు పెరిగి 1718.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,717.25 - 1,773.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 6.27 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. ఔన్స్ ధర -1.395 (-5.05%) డాలర్లు పెరిగి 26.242 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.195 - 27.570 డాలర్ల మధ్య కదలాడింది.