మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
బంగారం ధరలు నేడు (బుధవారం, జనవరి 20) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నిన్న రూ.49,000 దిగువన ముగిసిన ధర, నేడు ఆ మార్కును క్రాస్ చేసింది. భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటన ఆశల నేపథ్యంలో పసిడికి కాస్త డిమాండ్ పెరుగుతోంది. దీంతో అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ధరలు పెరగగా, ఆ ప్రభావం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ పైన పడింది. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,000 వరకు తక్కువగా ఉంది. కరోనా కేసులు, వ్యాక్సీన్, అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి.

రూ.49,900 పైకి పసిడి
నేడు ఉదయం సెషన్లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 167.00 (0.34%) పెరిగి రూ.49,150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,077.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,160.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,077.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 169.00 (0.34%) పెరిగి రూ.49,221.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,158.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,221.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,158.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వ్యాక్సినేషన్ నేపథ్యంలో పసిడి ధరలు పైకీ, కిందకు కదులుతున్నాయి.

వెండి స్వల్ప పెరుగుదల
బంగారం ధరలతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 324.00 (0.49%) పెరిగి రూ.66360.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,371.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,420.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,181.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.486.00 (0.73%) పెరిగి రూ.67265.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,205.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,269.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,110.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్లకు దిగువ పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికీ 1850 డాలర్లకు దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 9.05 (+0.49%) డాలర్లు పెరిగి 1,849.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,838.85 - 1,850.35 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 18.22% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.170 (+0.67%) డాలర్లు పెరిగి 25.490 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.247 - 25.552 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.82శాతం పెరిగింది.