నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
ముంబై: బంగారం ధరలు నేడు (జనవరి 18, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. గతవారం చివరి సెషన్లో రూ.500కు పైగా తగ్గిన పసిడి, నేడు అతి స్వల్పంగా పెరిగింది. వెండి గతవారం రూ.1700కు పైగా తగ్గింది. గత 5 నెలల కాలంలో బంగారం రూ.8400 వరకు తగ్గింది. ప్రపంచంలో బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.
ఏప్రిల్ నుండి బంగారం డిమాండ్ పడిపోయినప్పటికీ, 2020 చివరలో దసరా, దీపావళి పండుగ సీజన్‌కు తోడు, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల వల్ల డిమాండ్ పెరిగింది. దీనికి తోడు క్రమంగా తగ్గడం కూడా కలిసి వచ్చింది. పండుగలు, శుభకార్యాల వల్ల బంగారానికి చివరలో డిమాండ్ పెరిగింది. ఆగస్ట్ గరిష్టం తర్వాత పసిడి ధరలు అడపాదడపా పెరుగుతున్నప్పటికీ మొత్తానికి క్షీణిస్తున్నాయి.
ప్రపంచ టాప్ 500లో రిలయన్స్, టీసీఎస్ సహా 11 కంపెనీలు: వీటి వ్యాల్యూ ఎంతంటే

49,000 దిగువకు పసిడి
నేడు ఉదయం సెషన్లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 53.00 (0.11%) పెరిగి రూ.48,755.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,780.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,608.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7450 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80.00 (0.16%) పెరిగి రూ.48,795.00 వద్ద ఉంది. రూ.48,662.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,795.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,626.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి భారీగా డౌన్
సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 446.00 (0.69%) పెరిగి రూ.65210.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,055.00 వద్ద ప్రారంభమై, రూ.65,265.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,880.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.509.00 (0.78%) పెరిగి రూ.66125.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,892.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,133.00 వద్ద గరిష్టాన్ని, రూ.65815.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

25 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగి 1832 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. . గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -2.15 (-0.12%) డాలర్లు తగ్గి 1,832.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,803.60 - 1,832.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.74% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.67 (-0.67%) డాలర్లు తగ్గి 25.032 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.220 - 25.040 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 35.42 శాతం పెరిగింది.