Gold prices today: గుడ్‌న్యూస్, రూ.49,000 దిశగా బంగారం ధరలు
ముంబై: బంగారం, వెండి ధరలు నేడు (శుక్రవారం, 22 జనవరి) ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం క్షీణించగా, వెండి పెరిగింది. నేడు రెండింటి ధరలు కూడా కిందకు వెళ్తున్నాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7000 వరకు తక్కువగా ఉంది. కాగా, నిన్న గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధరలు రూ.89.00 క్షీణించి, రూ.49,445.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.22.00 తగ్గి రూ.46,619 వద్ద క్లోజ్ అయింది. ఇక, సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం నిన్న పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.330 పెరిగి రూ.67,320.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.350.00 పెరిగి రూ.68,190.00 వద్ద క్లోజ్ అయింది.
ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి

రూ.49వేల దిశగా పసిడి
నేడు ప్రారంభ సెషన్లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 120.00 (0.24%) క్షీణించి రూ.49,328.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,355.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,399.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,314.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలోనే కదలాడుతున్నాయి.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 96.00 (-0.19%) తగ్గి రూ.49,500.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,561.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,561.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిది అదే దారి
బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 500.00 (-0.74%) తగ్గి రూ.66800.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,701.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. వెండి ఆగస్ట్ నెలలో ఓ సమయంలో రూ.79వేలను తాకింది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. ఈ ధరతో రూ.10వేలకు పైగా తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగి 1870 డాలర్ల దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.05 (-0.22%) డాలర్లు తగ్గి 1,861.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,859.60 - 1,870.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.81% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.226 (+0.87%) డాలర్లు పెరిగి 25.628 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.405 - 26.047 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 43.53శాతం పెరిగింది.