Gold prices today: రూ.48,500... పడిపోతున్న బంగారం ధరలు, పెరిగిన వెండి ధర
నిన్నటి వరకు భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు బుధవారం (నవంబర్ 25) మరికాస్త తగ్గాయి. మిడిల్ సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ ఆ తర్వాత తగ్గింది. ఈ వారంలో మొదటి రెండు సెషన్లలో పసిడి ధరలు రూ.1600కు పైగా తగ్గాయి. బుధవారం రూ.37 తగ్గింది. రూ.49,000 దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే దాదాపు రూ.7,700 వరకు తక్కువగా ఉంది. ఇటీవల రూ.52,000ను దాటగా, నాటి నుండి రూ.3300 వేలు తగ్గింది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి భారీగా ఎగిసిన పసిడి ధరలు ఆగస్ట్ 7వ తేదీ తర్వాత క్రమంగా క్షీణించాయి.

బంగారం ధరలు క్లోజింగ్ తగ్గుదల
బుధవారం ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.37 (0.08%) తగ్గి రూ.48,548.00 వద్ద ముగిసింది. రూ.48,497.00 ప్రారంభ ధర, రూ.48,885.00 గరిష్టాన్ని, రూ.48,390.00 కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.23.00 (0.05%) పెరిగి రూ.48,455.00కు చేరుకుంది. రూ.48,455.00 వద్ద ప్రారంభమై, రూ.48,816.00 గరిష్టాన్ని, రూ.48,385.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,000 దిగువనే ఉన్నాయి.

స్వల్పంగా పెరిగిన సిల్వర్
ఎంసీఎక్స్‌లో వెండి స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.149.00 (0.25%) పెరిగి కిలో రూ.59,770.00 వద్ద క్లోజ్ అయింది. రూ.59,617.00 వద్ద ప్రారంభమై, రూ.60,472.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,135.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.187.00 (0.66%) ఎగిసి రూ.61,620.00 వద్ద ముగిసింది. రూ.61,278.00 వద్ద ప్రారంభమై, రూ.62,203.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,965.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి ధరలు రూ.62,000కు దిగువన ఉన్నాయి. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.60వేలకు దిగువన ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోను...
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ పసిడి ధర 3.60 (+0.20%)) డాలర్లు పెరిగి 1,809.10 డాలర్లకు చేరుకుంది. 1,805.15 - 1,810.00 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,805.50 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ఏడాదిలో 21.45 శాతం పెరిగింది.
వెండి ధర ఔన్స్ 0.093 (+0.40%) పెరిగి 23.455 డాలర్లకు చేరుకుంది. 23.370 - 23.445 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.362 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 35.7% పెరిగింది.