రూ.300 పెరిగిన బంగారం ధర, రూ.700 పెరిగిన వెండి: పసిడి రూ.51,000 క్రాస్
బంగారం ధరలు మంగళవారం (నవంబర్ 3) పెరిగాయి. ఉదయం సెషన్లో తగ్గిన పసిడి ఫ్యూచర్స్, సాయంత్రానికి అర శాతానికి పైగా మేర పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.298(0.58 శాతం) పెరిగి రూ.51,365 పలికింది. రూ.50,950 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,789 వద్ద కనిష్టాన్ని, రూ.51,440 వద్ద గరిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్‌లో పసిడి నిన్న ముగింపు సమయానికి రూ.51వేల మార్క్‌ను దాటింది. ఈ రోజు మరో మూడు వందల రూపాయల వరకు పెరిగింది.
వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు

రూ.300కు వరకు పెరిగిన బంగారం ధర
ఎంసీఎక్స్‌లో పసిడి రూ.298 వరకు పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.300కు పైగా పెరిగింది. రూ.303 (0.59 శాతం) పెరిగి రూ.51,519 పలికింది. పది గ్రాముల పసిడి రూ.51,106 వద్ద ప్రారంభం కాగా, రూ.51,550 వద్ద గరిష్టాన్ని, రూ.50,936 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,800 తక్కువగా ఉంది.

రూ.500 పెరిగిన వెండి
కిలో వెండి ధర రూ.500కు పైగా పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.558 (0.90 శాతం) పెరిగి రూ.62,656 వద్ద ట్రేడ్ అయింది. కిలో వెండి రూ.61,987.00 వద్ద ప్రారంభం కాగా, రూ.61,612.00 వద్ద కనిష్టాన్ని, రూ.62,791.00 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.714 (1.12 శాతం) పెరిగి రూ.64,317 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,450.00 ప్రారంభమైన ధర, రూ.63,237.00 వద్ద కనిష్టాన్ని, రూ.64,400.00 వద్ద గరిష్టాన్ని తాకింది.

కామెక్స్‌లో బంగారం, వెండి జంప్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర పెరిగింది. గతవారం 1880 డాలర్ల దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్, ఈ వారం 1900 డాలర్ల పైకి చేరుకుంది. ఔన్స్ పసిడి 0.71 శాతం పెరిగి రూ.1905.90 డాలర్లు పలికింది. 1,887.85 - 1,909.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 23 శాతం మేర పెరిగింది.
ఔన్స్ వెండి ధరలు 1.19 శాతం పెరిగి 24.312 డాలర్లు పలికింది. 23.988 - 24.488 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి ధర 33 శాతం పెరిగింది.