ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఎంసీఎక్స్‌లో నేడు సాయంత్రం గం.8.30 సమయానికి పసిడి ధర స్వల్పంగా తగ్గి, ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.10,500 వరకు తక్కువగా ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా రూ.50,000 దిగువనే కాదు, 46,000 స్థాయిలోనే కదలాడుతున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, డాలర్ కదలికలు వంటివి పసిడి కాంట్రాక్టు ధరలపై ప్రభావం చూపుతాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో గత ఏడాది ఆగస్ట్ నెలలో రూ.57వేలు క్రాస్ చేసిన బంగారం ఇప్పుడు 11000కు పైగా తగ్గింది.

రూ.46,000 దిగువకు పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (సోమవారం, మార్చి 1) ప్రారంభ సెషన్లో పెరిగినప్పటికీ, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. పసిడి రూ.45,800 దిగువకు వచ్చాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.32.00 (0.07%) తగ్గి రూ.45,704.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,139.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,626.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. ఉదయం భారీగా లాభపడిన బంగారం సాయంత్రానికి స్థిరంగా ట్రేడ్ అయింది. రూ.8.00 (0.02%) పెరిగి రూ.45,877 వద్ద ట్రేడ్ అయింది. 46,210.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,261.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,788.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1000 పెరిగిన వెండి
వెండి ధరలు వరుసగా పెరిగినప్పటికీ రూ.70,000 దిగువనే ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.939.00 (1.40%) పెరిగి రూ.68,200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,575.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,575.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,763.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.885.00 (1.29%) పెరిగి రూ.69669.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,854.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,872.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,270.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా పెరిగిన బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగినప్పటికీ, 1750 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +8.30 (+0.48%) డాలర్లు పెరిగి 1737.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,728.50 - 1,757.20
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 9.88 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +0.572 (+2.16%) డాలర్లు పెరిగి 27.12 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.672 - 27.175 డాలర్ల మధ్య కదలాడింది.