ఆల్‌టైం గరిష్టంతో రూ.8,400 డౌన్, భారీగా తగ్గిన బంగారం ధర: వెండి ఏకంగా రూ.4,500 వరకు డౌన్
ముంబై: బంగారం ధరలు పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు నష్టపోయాయి. దేశీ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో(MCX) గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.700కు పైగా తగ్గింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.4,238 పెరిగి రూ.73వేలు దాటింది. అయితే ఈ రోజు పసిడితో పాటు వెండి కూడా పతనమైంది. 10 గ్రాముల పసిడి రూ.48,000 దిగువకు వచ్చింది. వెండి నిన్న రూ.4వేలకు పైగా పెరగగా, నేడు అదే స్థాయిలో తగ్గింది. ఈ ఏడాది పసిడి ధరలు మొదటిసారి రూ.47వేల స్థాయికి వచ్చాయి.

48,000 దిగువకు పసిడి
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో 559.00(1.16%) తగ్గి రూ.47,835.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,265.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,265.00 వద్దే గరిష్టాన్ని తాకి, రూ.47,606.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8400 వరకు తక్కువ ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 890.00 (-1.83%) తగ్గి రూ.47,830.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,612.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,612.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,784.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న భారీగా జంప్, నేడు అదే స్థాయిలో డౌన్
వెండి నిన్న భారీగా షాకిచ్చింది. నేడు అదే స్థాయిలో తగ్గింది. నిన్న రూ.4,238 పెరిగి రూ.73వేలు దాటిన వెండి, నేడు సాయంత్రం సెషన్‌కు దాదాపు రూ.4500 తగ్గి రూ.70వేల దిగువకు వచ్చింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 4,471.00 (-6.07%) తగ్గి రూ.69,195.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,600.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,600.00 వద్దనే గరిష్టాన్ని తాకి, రూ.69,004.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.4,489.00 (-6.00%) తగ్గి రూ.70342.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,675.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,342.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గి 1840 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 29.20 (1.57%) తగ్గి 1,834.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,830.50 - 1,866.30 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.79% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ సిల్వర్ ధర 2.373 (8.07%) డాలర్లు తగ్గి 27.045 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.795 - 29.250 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 60.29శాతం పెరిగింది.