For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక్కడ తగ్గి, అక్కడ పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు జంప్

|

నవంబర్ నెలలో భారీగా తగ్గిన పసిడి ధరలు డిసెంబర్ 1, మంగళవారం ప్రారంభ సెషన్లో కాస్త పెరిగాయి. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ ప్రారంభంలో 0.3 శాతం ఎగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 1.2 శాతం పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం ధరలు రూ.8500 తక్కువగా ఉంది.

బంగారం ధరలు మరో రూ.1,000 తగ్గనున్నాయా? వెండి ఆ స్థాయి కంటే కిందకు వస్తే..

స్వల్పంగా తగ్గిన పసిడి

స్వల్పంగా తగ్గిన పసిడి

నేడు డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం గం.1 సమయానికి 10 గ్రాముల బంగారం రూ.87.00 (-0.18%) క్షీణించి రూ.47,705.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,194.00 వద్ద ప్రారంభమై, రూ.48,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.61.00 (-0.13%) క్షీణించి రూ.47,857.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,097.00 వద్ద ప్రారంభమై, రూ.48,138.00 గరిష్టాన్ని, రూ.47,771.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న (సోమవారం, నవంబర్ 30) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.362.00 (-0.75%) క్షీణించి రూ.47,763.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.184.00 (-0.38%) తగ్గి రూ.47,915.00 వద్ద ముగిసింది.

వెండి ధరలు జంప్

వెండి ధరలు జంప్

ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర (డిసెంబర్) రూ.558.00 (0.94%) పెరిగి రూ.59680.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,908.00 వద్ద ప్రారంభమై, రూ.60,000.00 గరిష్టాన్ని, రూ.59,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.478.00 (0.79%) పెరిగి రూ.60700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,012.00 ప్రారంభమై, రూ.61,109.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,575.00 వద్ద కనిష్టాన్న తాకింది.

సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.34.00 (-0.06%) తగ్గి రూ.58,950.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.129.00 (-0.21%) తగ్గి రూ.60,130.00 వద్ద ముగిసింది.

అక్కడ పసిడి పెరుగుదల

అక్కడ పసిడి పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10.30 (+0.58%) పెరిగి 1,791 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,780.90 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 1,778.45 - 1,790.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి 19 శాతం పెరిగింది. వెండి ధరలు 0.487 (+2.16%) డాలర్లు పెరిగి 23 డాలర్లు దాటింది. రెండు రోజులుగా 23 డాలర్లకు దిగువన ఉంది. నేడు 22.670 - 22.992 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 33 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 22.593 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

Gold price today: Yellow metal trades below Rs 48,000, Silver price rise

Gold prices rose in Indian markets on December 1 on higher international spot prices. On the MCX, February gold contracts were trading higher by 0.36 percent at Rs 48,090 per 10 gram at 0920 hours. March silver was trading 1.29 percent higher at Rs 61,000 per kg.
Story first published: Tuesday, December 1, 2020, 13:18 [IST]
Company Search