For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న భారీగా తగ్గి, నేడు పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.1100కు పైగా జంప్

|

నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు(జూన్ 18) మళ్లీ పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను ఈ రెండింటి ధరలు ఎగిశాయి. నిన్న ఒక్కరోజే ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1600, వెండి రూ.4వేల వరకు తగ్గింది. అయితే నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా రూ.1000కి పైగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1775 డాలర్ల దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు మళ్లీ 1800 డాలర్లకు చేరుకున్నాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9000 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరల

పెరిగిన బంగారం ధరల

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.176.00 (0.37%) పెరిగి రూ.47134.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,147.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,387.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,962.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.210.00 (0.44%) పెరిగి రూ.47486.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,415.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,566.00 గరిష్టాన్ని, రూ.47,360.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1100 పెరిగిన వెండి

రూ.1100 పెరిగిన వెండి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.1,129.00 (1.67%) పెరిగి రూ.68728.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,417.00 వద్ద ప్రారంభమై, రూ.68,728.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.68,081.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,089.00 (1.59%) పెరిగి రూ.69715.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,324.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,721.00 గరిష్టాన్ని, రూ.69,104.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 20.10 (1.13%) డాలర్లు పెరిగి 1,794.90 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.85 - 1,795.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది 0.627 (2.42%) డాలర్లు పెరిగి 26.483 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.930 - 26.453 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Price Today: Yellow metal rises to Rs 47,134 today

Now gold and silver both are trading on oversold zone in daily chart where we can see a pullback rally any time.
Story first published: Friday, June 18, 2021, 14:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X