శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధర, రూ.45,000 దిగువకు..! వెండి రూ.1500 డౌన్
ముంబై: బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. సాయంత్రం సెషన్‌కు ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.500 వరకు తగ్గింది. ఓ సమయంలో రూ.1000 కూడా క్షీణించి 44,600 దిగువకు పడిపోయింది. చాలా రోజుల తర్వాత పసిడి 44వేల స్థాయికి వచ్చింది. వెండి ధరలు కూడా రూ.1500 వరకు తగ్గి రూ.66,000 దిగువకు వచ్చాయి. క్రితం సెషన్లో పసిడి ధరలు రూ.200 వరకు పెరిగాయి. ప్రస్తుతం సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి పది నెలల కనిష్టానికి చేరుకుంది. పసిడి ధరలు రూ.45,000 దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఒరవడి కొనసాగితే ఈ వారంలోనే రూ.44,000 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.

రూ.45,000 దిగువకు పసిడి!
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (బుధవారం, మార్చి 3) సాయంత్రం సెషన్లో రూ.45,000 దిగువకు పడిపోయాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.495.00 (-1.09%) తగ్గి రూ.45,053.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,524.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,544.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,561.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.579.00 (-1.27%) తగ్గి రూ.45,170 వద్ద ట్రేడ్ అయింది. 45,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,747.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.66,000 దిగువకు వెండి
వెండి ధరలు భారీగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,413.00 (-2.10%) తగ్గి రూ.65,926.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,035.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,214.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,913.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,172.00 (-1.69%) తగ్గి రూ.68043.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,216.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,332.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,850.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం భారీగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 1725 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 11.95 (0.69%) డాలర్లు తగ్గి 1721.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,699.65 - 1,738.90 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 7.66 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిగువన ఉంది. ఔన్స్ ధర 0.391
(1.45%) డాలర్లు తగ్గి 26.488 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.878 - 26.913 డాలర్ల మధ్య కదలాడింది.