భారీ తగ్గుదల తర్వాత షాక్: రూ.900 పెరిగిన బంగారం, రూ.3,300 పెరిగిన వెండి
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 2) ప్రారంభ సెషన్లో ఫ్యూచర్ మార్కెట్లో మళ్లీ ఎగిశాయి. నిన్న కూడా పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. నిన్న బంగారం రూ.700 వరకు, వెండి రూ.3000కు పైగా పెరిగింది. బంగారం ఈ రెండు రోజుల్లో రూ.900 పెరగగా, వెండి రూ.3,300 వరకు పెరిగింది. ఆగస్ట్ 7వ తేదీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు రూ.7800 తక్కువగా ఉన్నాయి. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో పోలిస్తే రూ.17వేలకు పైగా తక్కువగా ఉంది.
RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్

రూ.900 పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.211.00 (0.44%) పెరిగి రూ.48,486.00 వద్ద ట్రేడ్ అయింది. కాగా, క్రితం సెషన్(డిసెంబర్ 1) లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.694.00 (1.45%) పెరిగి రూ.48,486.00 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.662.00 (1.38%) ఎగిసి రూ.48,580.00 వద్ద ముగిసింది. బంగారం ధర రెండు రోజుల్లో రూ.900 పెరిగింది.

వెండి ధర జంప్
సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.282 (0.46 శాతం) పెరిగి రూ.62,200 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.3,078.00 (5.21%) పెరిగి రూ.62,200.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.2,943.00 (4.89%) ఎగిసి రూ.63,165.00 వద్ద క్లోజ్ అయింది.

బంగారం, వెండి డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 5.05 (-0.28%) క్షీణించి 1,813.85 డాలర్లు పలికింది. 1,811.75 - 1,819.20 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 22 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.232 (-0.96%) డాలర్లు క్షీణించి 23.858 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రోజంతా 23.723 - 24.140 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24 డాలర్ల వద్ద ముగిసిన వెండి, ఏడాదిలో 40 శాతం పెరిగింది.