Gold Price Today: తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి
గత నాలుగు రోజులుగా ఫ్యూచర్ మార్కెట్లో పెరుగుతున్న పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ రూ.49,000కు పైనే ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7000 తక్కువగా ఉంది. అలాగే, గత వారం రూ.48,000 దిగువకు రాగా, ఇప్పుడు 49వేలను క్రాస్ చేసింది. పసిడి ధరలు క్షీణించగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ.63,500కు పైన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దాదాపు స్థిరంగా ఉంది. వెండి స్వల్పంగా పెరగగా, పసిడి స్వల్పంగా తగ్గింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00(-0.24%) క్షీణించి రూ.49,184 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,415.00 ప్రారంభమైన ధర, రూ.49,473.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,090.00 కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.86.00 (-0.17%) క్షీణించి రూ.49,166.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,460.00 ప్రారంభమై, రూ.49,499.00 గరిష్టాన్ని, రూ.49,166.00 కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా జంప్
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.133.00 (0.21%) పెరిగి కిలో రూ.63763.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,722.00 వద్ద ప్రారంభమై, రూ.64,567.00 గరిష్టాన్ని, రూ.63,406.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.261.00 (0.41%) పెరిగి రూ.64491.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,600.00 వద్ద ప్రారంభమై, రూ.65,304.00 గరిష్టాన్ని, రూ.64,222.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.95 (-0.16%) డాలర్లు తగ్గి 1,838.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,835.85 - 1,851.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1841 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. పసిడి ఏడాదిలో 22.51 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.040 (+0.17%) డాలర్లు పెరిగి ఔన్స్ 24.177 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.073 - 24.545 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి 41.15 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 24.137 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.