Gold price@రూ.46,150: రూ.10,000 కంటే ఎక్కువ తగ్గిన పసిడి ధరలు
బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 24, గురువారం) భారీగా తగ్గాయి.
వరుసగా మూడో రోజు క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే దాదాపు ఇరవై శాతం వరకు లేదా దాదాపు రూ.10,000కు పైగా తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. అయితే కిలో రూ.70వేల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా తగ్గి 1800 డాలర్లకు చాలా దిగువకు వచ్చింది. వెండి మాత్రం 27వేల నుండి 28 డాలర్ల మధ్యే కదలాడుతోంది. కరోనా కేసులు, వ్యాక్సినేషన్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, వడ్డీ రేట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే

రూ.10వేల కంటే పైగా తగ్గిన పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు భారీగా తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.372.00 (0.80%) తగ్గి రూ.46,150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,443.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,655.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,111.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 కంటే పైన తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.357.00 (0.76%) తగ్గి రూ.46,320 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,579 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,770 వద్ద గరిష్టాన్ని, రూ.46,300 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
వెండి ధరలు పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.187.00 (0.27%) తగ్గి రూ.69,730.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,126.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,537.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,450.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.248.00 (0.35%) పెరిగి రూ.71,055.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,304.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,850.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,741.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువన పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడూ తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 21.70 (-1.21%) డాలర్లు పెరిగి 1776.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,768.45 - 1,804.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 7.77 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. ఔన్స్ ధర 0.059
(-0.21%) డాలర్లు పెరిగి 27.795 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.650 - 28.265 డాలర్ల మధ్య కదలాడింది.