For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విగ్గీ, జొమాటోతో గోద్రేజ్ ఆగ్రోవేట్ ఒప్పందం

|

గోద్రేజ్ ఆగ్రేవెట్ లిమిటెడ్(GAVL) డెయిరీ, పౌల్ట్రీ, ఇతర ఫుడ్ ఉత్పత్తుల సరఫరా కోసం ఫుడ్ అగ్రిగేటర్లు జొమాటో, స్విగ్గీలతో ఒప్పందం కుదుర్చుకుంది. గోద్రేజ్ ఆగ్రేవేట్ తమ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులతో పాటు డైరీ ఉత్పత్తులను నిరంతరాయంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్‌తో జత కట్టింది.

50 రోజులుగా క్లోజ్, అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

కరోనా వైరస్ నేపథ్యంలో కస్టమర్లకు నిత్యావసరాలతోపాటు, డైరీ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో గోద్రెజ్ ఆగ్రోవేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు తగ్గిన నగరాల్లో సేవలు అందిస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఇతర నగరాల్లో కూడా సేవలను అందించడానికి సిద్ధమైంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ అనుబంధ గోద్రేజ్ జెర్సీ ఉత్పత్తుల్ని కూడా స్విగ్గీ , జొమాటో ద్వారా కస్టమర్లకు అందించనున్నాయి.

స్విగ్గీ, జొమాటోతో గోద్రేజ్ ఆగ్రోవేట్ ఒప్పందం

ఈ ఒప్పందం కింద పాలు, నెయ్యి, పెరుగు, పన్నీర్, బట్టర్ మిల్క్ సరఫరా చేస్తారు. వీటిని ఇప్పటికే ఈ-కామర్స్ సైట్స్ బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో కూడా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

English summary

Godrej Agrovet partners with Zomato and Swiggy to ensure uninterrupted supplies

Godrej Agrovet Limited has announced a partnership with food delivery apps Zomato and Swiggy. This move comes as a response to ensure uninterrupted supply of essentials to customers amidst the ongoing Covid-19 outbreak.
Story first published: Sunday, May 10, 2020, 18:50 [IST]
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more