For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటైనర్ల కొరత, భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం

|

ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ కంటైనర్స్ కొరత కనిపిస్తోంది. ఇది భారత్ నుండి ఎగుమతుల పైన ప్రభావం కనిపించవచ్చు. కంటైనర్స్ కొరత కారణంగా వివిధ రంగాలకు చెందిన ఉత్పత్తులపై రవాణా రేట్లు భారీగా పెరిగే అవకాశముంది. ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చైనాలో కరోనా ఆందోళనకర పరిస్థితులతో వివిధ పోర్ట్స్ మూసివేయడం లేదా తక్కువ సామర్థ్యంతో రవాణా కార్యకలాపాలు కొనసాగడం వంటి అంశాలు ప్రపంచ కంటైనర్ కొరతకు కారణమని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా, యూరోప్ ప్రాంతాల్లో కంటైనర్లకు భారీ డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుదలకు కారణమయ్యాయని చెబుతున్నారు. కంటైనర్ ఛార్జీలు గత పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని ఈ రంగంలోని వారు చెబుతున్నారు.

ఈ ఏడాది జూలై నెలలో భారత్ ఎగుమతులు 35.2 బిలియన్ డాలర్లతో రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. భారత నెలవారీ ఎగుమతుల చరిత్రలోనే ఇది గరిష్టం. కానీ ఇప్పుడు ఎగుమతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందుకు కంటైనర్ల కొరత, సరుకు రవాణా రేట్ల పెంపు కారణం. ఈ కారణాలతో ఎగుమతులు మందగించే ప్రమాదం ఉంది. ధరలు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. కొద్ది నెలల క్రితం కంటైనర్ ధరలు 3000 డాలర్ల నుండి 4000 డాలర్ల మధ్య ఉంటే, ఇప్పుడు ఏకంగా 7000 డాలర్ల నుండి 10,000 డాలర్లకు పెరిగినట్లు పరిశ్రమ నిర్వాహుకులు చెబుతున్నారు. అంతేకాదు, దూరాన్ని బట్టి ఖర్చు మారుతుంది.

Global container shortage poses fresh export hurdle for India

ఎక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ... కంటైనర్ల కొరతను ఎదర్కోవడంతో పాటు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్(EIEO), ఇతర కొన్ని ఇండస్ట్రీ బ ాడీస్ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. పశ్చిమ దేశాల్లో రాబోయే సెలవుల సీజన్‍‌కు ముందు భారత్ కీలక ఎగుమతులపై నష్టపోయే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. FIEO డైరెక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ... కంటైనర్లకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని పరిశ్రమ కోరిందని తెలిపారు.

English summary

కంటైనర్ల కొరత, భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం | Global container shortage poses fresh export hurdle for India

Aglobal shortage in shipping containers could slow down Indian exports after a sharp recovery earlier this year.
Story first published: Monday, August 30, 2021, 20:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X