For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు వరుస షాక్‌లు: భారత్‌కు జర్మన్ బ్రాండ్, రూ.800 కోట్లతో లావా

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు చైనా నుండి ఇతర దేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. వివిధ దేశాలు డ్రాగన్ దేశం నుండి వచ్చే కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపట్టింది. తాజాగా జర్మనీ ఫుట్‌వేర్ దిగ్గజం వోన్ వెల్‌ఎక్స్ బ్రాండ్ ఇండియాకు తరలి రానుంది. వోన్ వెల్‌ఎక్స్ బ్రాండుతో ఆరోగ్యకర పాదరక్షలు తయారు చేస్తోంది జర్మనీ సంస్థ కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్.

చైనాకు ఫస్ట్ ఝలక్: ఇండియాకు ఆపిల్ ప్రొడక్షన్ యూనిట్ల తరలింపు, కేంద్రం ఆ అవరోధాలు తొలగించాకే..

చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు ప్లాంట్

చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు ప్లాంట్

కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్ చైనాలోని తన ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 18 ప్లాంట్స్ ఉన్నాయి. చైనాలో రెండు ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం 30 లక్షల జతలకు పైగా పాదరక్షలు తయారు చేస్తోంది. ఈ ప్లాంట్స్‌ను భారత్‌కు తరలించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకు తొలి దశలో రూ.110 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని భావిస్తోంది. కాసా ఎవర్జ్ కోసం పాదరక్షలు తయారు చేసేందుకు లైసెన్స్ పొందిన ల్యాట్రిక్ ఇండస్ట్రీస్ సహకారంతో ఉత్తర ప్రదేశ్‌లో ఈ కొత్త తయారీ ప్లాంటును నెలకొల్పుతుంది.

యూపీ ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాక..

యూపీ ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాక..

వివిధ దశాల్లో చర్చలు జరిపిన అనంతరం చైనాలోని తమ ఉత్పత్తిని ఇక నుండి భారత్‌కు తరలించేందుకు కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్ నిర్ణయం తీసుకుందని ల్యాట్రిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, సీఈవో ఆశిష్ జైన్ అన్నారు. ల్యాట్రిక్‌కు 5 లక్షల జతల పాదరక్షల సామర్థ్యంతో ఇప్పటికే ప్లాంట్ ఉందని, కొత్త ప్లాంటును 30 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తారని, యూపీ ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల సహకారాలు, అనుమతులు పొందిన తర్వాత టార్గెట్ రీచ్ కావడానికి రెండేళ్ల సమయం పడుతుందన్నారు. కార్మికుల లభ్యత, ముడి సరుకు అందుబాటులో ఉండటంతో భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. రెండో దశలో ముడి పదార్థాల ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

12 లైసెన్సీల ద్వారా మార్కెట్

12 లైసెన్సీల ద్వారా మార్కెట్

ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో కాసా ఎవర్జ్ ఉత్పత్తులు సేల్ అవుతాయి. 18 ఉత్పాదక కేంద్రాలు ఉండగా, 12 లైసెన్సీలు ఉన్నారు. ఈ లైసెన్సీల ద్వారా ఆయా దేశాల్లో కాసా ఎవర్స్ బ్రాండ్స్ మార్కెట్ అవుతున్నాయి. మన దేశంలో 2019లో ఈ బ్రాండ్ పాదరక్షల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాలతో భారత్ భవిష్యత్తు తయారీ కేంద్రంగా అవతరించనుందని జైన్ చెప్పారు.

చైనా నుండి లావా కూడా..

చైనా నుండి లావా కూడా..

ఇండియన్ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ కూడా చైనాకు గుడ్‌బై చెబుతోంది. చైనాలోని తమ కార్యకలాపాలను భారత్‌కు మారుస్తున్నట్లు నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. రానున్న అయిదేళ్లలో రూ.800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన విధాన నిర్ణయాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హరి ఓంరాయ్ తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు బాగున్నాయన్నారు. ఇకపై భారత్‌లో మొబైల్స్ అభివృద్ధి, తయారీ ఉంటుందన్నారు. చైనాలో మా మొబైల్స్ డిజైన్ కోసం దాదాపు 600-650 మంది ఉద్యోగులున్నారని, ఇప్పుడు ఈ డిజైనింగ్‌ను భారత్‌కే తరలిస్తున్నామని, మార్కెట్లో తమ డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు చైనా నుండి మా మొబైల్ ఫోన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేశామని, ఇక నుండి భారత్ నుండి చేస్తామన్నారు. ఇప్పటికే మొబైల్ ఛార్జర్లు ఎగుమతి అవుతున్నాయన్నారు. చైనా నుండి ఆపిల్ కూడా భారత్ వైపు చూస్తోంది. అయితే ట్రంప్ తమ దేశం రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

English summary

German footwear maker to shift production to India from China

Casa Everz Gmbh, the owner of Germany-based healthy footwear brand Von Wellx, will be shifting its entire shoe production of over three million pairs annually in China to India with an initial investment of ₹110 crore, according to a top official of the company's licensee Iatric Industries Pvt Ltd.
Story first published: Wednesday, May 20, 2020, 9:55 [IST]
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more