For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: వామ్మో అదానీ సంపద.. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కు మించి..పూర్తి వివరాలు..

|

Gautam Adani: 2022లో అదానీ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఏడాది చివరికి వచ్చే నాటికి అవి మరింతగా పెరిగాయి. తాజాగా వెడువడిన వార్తల ప్రకారం వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 2022లో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ సంపాదించారు. ఒకపక్క ప్రపంచ కుబేరుల సంపద మంచులా కరిగిపోతోంటే అదానీ ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.

బిలియనీర్ రికార్డు..

బిలియనీర్ రికార్డు..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా ప్రకారం ఆయన ఆస్తుల విలువ 110 బిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం 2022లో అదానీ సంపద ఏకంగా 33.80 బిలియన్ డాలర్లు లేదా 44.2 శాతం పెరిగింది. ఇది పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాప్ (సుమారు $30 బిలియన్లు) కంటే ఎక్కువ కావటం గమనార్హం. డిసెంబర్ 26 నాటికి 6,409.47 బిలియన్ పాకిస్తానీ రూపాయలుగా ఉంది. అంటే నిన్నటి వరకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ 28.41 బిలియన్ డాలర్లుగా ఉంది.అదానీ ఈ ఏడాది ఏకంగా 33.8 బిలియన్ డాలర్లను ఆర్జించారు.

 అదానీ నెట్‌వర్త్..

అదానీ నెట్‌వర్త్..

అదానీ 2022లో సంపాదించిన మొత్తం.. ఎల్ సాల్వడార్ హోండురాస్, సైప్రస్ ఎల్ సాల్వడార్, కంబోడియా, ఐస్‌లాండ్, యెమెన్, సెనెగల్, సైప్రస్ వంటి కనీసం 85 దేశాల 2021 GDP కంటే ఎక్కువ ఆర్జించారు. అదానీ సంపద భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 563.50 బిలియన్ డాలర్లలో ఐదో వంతు.

అబానీ కంటే ముందు..

అబానీ కంటే ముందు..

2022లో ముకేష్ అంబానీ కంటే అదానీ చాలా ముందు ఉన్నారు. 60 ఏళ్ల వయస్సులో అదానీకి పునరుత్పాదక ఇంధనం, పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, డిఫెన్స్, ఎయిర్‌పోర్ట్‌లతో పాటు ఇతర రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20న గౌతమ్ అదానీ మొత్తం ఆస్తులు 150 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముకేష్ అంబానీ ఆస్తుల విలువ 85.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

అదానీ షేర్ల అద్బుతాలు..

అదానీ షేర్ల అద్బుతాలు..

2022 క్యాలెండర్ సంవత్సరంలో అదానీ గ్రూప్ కు చెందిన 6 షేర్లు రూ.6.78 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ను జోడించాయి. ఈ ఏడాది ఐపీవోగా వచ్చిన అదానీ విల్మర్ మార్కెట్ క్యాప్ తొలిరోజే రూ.34,467.48 కోట్ల నుంచి రూ.68,187.64 కోట్లకు పెరిగింది. ఈ వారం కూడా కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో లాభపడి వార్తల్లో నిలిచాయి. డిసెంబర్ 31, 2021న రూ.99.75గా ఉన్న అదానీ పవర్ షేర్లు సోమవారం నాటికి 176 శాతం పెరిగి రూ.275.35కి చేరాయి.అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు సైతం ఈ ఏడాది 117.47 శాతం లాభపడ్డాయి. అదానీ టోటల్ గ్యాస్ 93 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 42 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 41 శాతం, అదానీ పోర్ట్స్ 10 శాతం లాభపడి ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించాయి.

English summary

Gautam Adani: వామ్మో అదానీ సంపద.. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కు మించి..పూర్తి వివరాలు.. | Gautam Adani Wealth crossed listed companies value of pakistan stock exchange

Gautam Adani Wealth crossed listed companies value of pakistan stock exchange
Story first published: Wednesday, December 28, 2022, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X