For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్‌డౌన్: ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరా, వినియోగంపై భారీ ప్రభావం

|

దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు. కరోనా మహమ్మారి షట్ డౌన్ నేపథ్యంలో వివిధ రంగాలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ప్రజలు తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ కస్టమర్లపై కూడా ప్రభావం పడే అవకాశముంది. భారత లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (LNG) స్టోరేజ్ గణనీయంగా పడిపోయింది. కస్టమర్లకు రోజువారీ గ్యాస్ పంపిణీ తగ్గిపోయింది. కొనుగోలుదారులు ఎక్కువ సరుకులు స్టోర్ చేసుకోలేకపోతున్నారు.

భారీ లాభాల్లోకి మార్కెట్లు.. కారణాలివే, ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద రికవరీ

దిగుమతులపై ప్రభావం పడితే..

దిగుమతులపై ప్రభావం పడితే..

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. ఈ ప్రభావం పోర్ట్ ఆపరేషన్స్‌పై పడింది. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియా ఇంధన దిగుమతిలో అగ్రస్థానంలో ఉంది. దిగుమతులపై ప్రభావం పడితే అది ఎల్ఎన్జీ ధరలపై కూడా ఉంటుంది. కరోనా పుట్టిన చైనాలో ఈ ప్రభావం కనిపిస్తోంది.

లాక్ డౌన్ ప్రభావం

లాక్ డౌన్ ప్రభావం

దేశంలోని 130 కోట్ల మంది లాక్‌డౌన్‍‌లో ఉన్నారు. బుధవారం (మార్చి 25) నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు 21 రోజులు ఇళ్లకే పరిమితమవుతారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుక్కోవచ్చు. దీంతో అనే పరిశ్రమలు, సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాియ. కొన్ని పోర్ట్‌లు కూడా తప్పనిసరిగా బంద్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఎల్ఎన్జీ మార్కెట్‌పై ఉండవచ్చునని అంటున్నారు.

ఎల్ఎన్జీ ఎక్కడ విక్రయించాలి?

ఎల్ఎన్జీ ఎక్కడ విక్రయించాలి?

ఇండియా టాప్ గ్యోస్ ఇంపోర్టర్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ.. ఖతార్ గ్యాస్‌కు సరుకుల ఆలస్యంపై సమాచారం అందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గ్యాస్ డిమాండ్ భారీగా తగ్గిందని, మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం ఫెర్టిలైజర్స్, పవర్, రిఫైనరీస్ వంటివి మాత్రమే రన్ అవుతున్నాయని, మిగతావి షట్ డౌన్ అయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ విక్రయించాలని అంటున్నాయి. ఇప్పటికే కొంతమంది సప్లయర్స్‌కు ఇందుకు సంబంధించి సమాచారం అందించిన ఎల్ఎన్జీ సంస్థలు మిగతా వారికి పంపించే పనిలో ఉన్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్ప్ (GSPC) కూడా తమ ఎల్ఎన్జీ సప్లయర్స్‌కు నోటీసులు పంపించిందట.

11 కార్గోల టెండర్ రద్దు

11 కార్గోల టెండర్ రద్దు

లాక్ డౌన్ కారణంగా విక్రయాలు ఆలస్యమవుతాయని, ఇప్పటికే తమ కస్టమర్లు తమ దృష్టికీ తీసుకు వచ్చారని, కెమికల్, టెక్స్‌టైల్స్, సెరామిక్ వంటి పరిశ్రమలు మూతబడుతున్నాయని, దీంతో వినియోగం తగ్గుతోందని జీఎస్పీసీ చెబుతోంది. డిమాండ్ లేకపోవడం వల్ల GSPC 2020 మే నుండి 2021 మార్చ్ మధ్య 11 కార్గోలను దిగుమతి చేసుకునే టెండర్‌ను రద్దు చేసిందట. టెండర్స్ రద్దు చేయాలని నిర్ణయించామని చెబుతున్నారట.

వినియోగం పడిపోయింది..

వినియోగం పడిపోయింది..

ట్రాన్సుపోర్ట్ సెగ్మెంట్ 10 శాతం పడిపోయిందని, రిటైల్ గ్యాస్ 10 శాతం పడిపోయిందని, పరిశ్రమలు మూతబడ్డాయని సంస్థలు చెబుతున్నాయి. భారత్ కోసం తరలించిన కార్గోస్‌ను చైనాకు తరలించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి వార్తలు మాత్రమే వస్తున్నాయి. దీనిపై గెయిల్, జీఎస్పీసీ, పెట్రోనెట్, ఖతార్ గ్యాస్ వంటివి స్పందించాల్సి ఉంది.

యూరోప్ తర్వాత ఇండియా..

యూరోప్ తర్వాత ఇండియా..

ప్రస్తుతం చమురు, గ్యాస్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం లేదని, కానీ రాబోయే రోజుల్లో డొమెస్టిక్ డిమాండ్ తగ్గి ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు. లాక్ డౌన్ వల్ల సప్లై తాత్కాలికంగా సప్లై నిలిచిపోవడం వల్ల ఓఎన్జీసీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (కాపెక్స్)పై ప్రభావం పడుతుందని ఈ సంస్థ చైర్మన్ శశిశంకర్ అన్నారు. 2020-21 కోసం 325 బిలియన్ రూపాయల కాపెక్స్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఇటీవల చైనా కరోనా నుండి కాస్త కుదురుకుంటున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగింది. దీంతో ఆసియా స్పాట్ ఎల్ఎన్జీ ధరలు ధరలు కాస్త పెరిగాయి. అయితే యూరోప్‌లో, ఇప్పుడు భారత్‌లో గ్యాస్ డిమాండ్‌పై ప్రభావం చూపడంతో లాభాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

English summary

Gas Demand Slumps: LNG Importers Issue Force Majeure Notices

Indian liquefied natural gas (LNG) importers have issued force majeure notices to suppliers as domestic gas demand and port operations are hit by a nationwide lockdown to curb the spread of coronavirus.
Story first published: Thursday, March 26, 2020, 9:46 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more